ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నోటిఫికేషన్‌ నిబంధనలే ఫైనల్‌

ABN, First Publish Date - 2021-08-01T08:52:03+05:30

ఉద్యోగ నోటిఫికేషన్‌/జీవోలో ప్రస్తావించకుండా... అనుబంధంగా జారీచేసిన ప్రకటన ఆధారంగా స్పోర్ట్స్‌ కోటా కింద రిజర్వేషన్‌ నిరాకరించడానికి వీల్లేదని ఏపీపీఎస్సీకి హైకోర్టు తేల్చిచెప్పింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పిటిషనర్‌ను స్పోర్ట్స్‌ కోటాలో తీసుకోండి

ఏపీపీఎస్సీని ఆదేశించిన హైకోర్టు


అమరావతి, జూలై 31(ఆంధ్రజ్యోతి): ఉద్యోగ నోటిఫికేషన్‌/జీవోలో ప్రస్తావించకుండా... అనుబంధంగా జారీచేసిన ప్రకటన ఆధారంగా స్పోర్ట్స్‌ కోటా కింద రిజర్వేషన్‌ నిరాకరించడానికి వీల్లేదని ఏపీపీఎస్సీకి హైకోర్టు తేల్చిచెప్పింది. ‘తోక కుక్కను ఆడించలేదని.. కుక్క మాత్రమే తోకను ఆడించగలద’ని పేర్కొంది. అదేవిధంగా నోటిఫికేషన్‌ నిబంధనల ప్రకారమే ఏపీపీఎస్సీ వ్యవహరించగలదని.. అనుబంధంగా ఇచ్చిన ఫామ్‌-1లోని అంశాలకు అనుగుణంగా నడుచుకోరాదని స్పష్టం చేసింది. పిటిషనర్‌ను స్పోర్ట్స్‌ కోటా కింద పరిగణలోకి తీసుకోవాలని ఆదేశించింది. ప్రస్తుత జీవో/నోటిఫికేషన్‌ స్పష్టమైన ప్రమాణాలను ఖరారు చేయనందున పిటిషనర్‌ స్పోర్ట్స్‌ కోటాకు అర్హుడని స్పష్టంచేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎ్‌సఎస్‌ సోమాయజులు ఇటీవల తీర్పు వెల్లడించారు. పిటిషనర్‌ టెన్నిస్‌ క్రీడాకారుడు జె.వెంకట్‌ బాలాజీ స్పోర్ట్స్‌కోటా కింద గ్రూప్‌-1 పోస్టుకు దరఖాస్తు చేసుకున్నారు. రాతపరీక్షలను క్లియర్‌ చేశాడు. ఏపీపీఎస్సీ సూచనల మేరకు క్రీడల్లో పాల్గొన్న ధృవీకరణ పత్రాలు సమర్పించాడు. అయితే, ఏపీపీఎస్సీ ఏర్పాటు చేసిన కమిటీ బాలాజీ అభ్యర్థనను తిరస్కరించింది.


నోటిఫికేషన్‌కు అనుబంధంగా ఇచ్చిన ఫామ్‌-1లో పేర్కొన్న అంశాలకు అనుగుణంగా పిటిషనర్‌ నేషనల్‌, మల్టీ నేషనల్‌ పోటీల్లో దేశం తరఫున పాల్గొననందున రిజర్వేషన్‌ను తిరస్కరిస్తున్నట్లు పేర్కొంది. ఈ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ బాలాజీ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ.. జీవో 74 మేరకు ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన వారి దగ్గరనుంచి రాష్ట్ర స్థాయి, అంతర్‌ జిల్లాస్థాయి పాఠశాల క్రీడల్లో పాల్గొన్నవారికి సైతం క్రీడల కోటాకు అర్హులేనన్నారు. ఇంటర్నేషనల్‌ లేక మల్టీ నేషనల్‌ పొల్గొన్నవారు మాత్రమే స్పోర్ట్స్‌ కోటా కింద గ్రూప్‌-1 పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని నోటిఫికేషన్‌లో పేర్కొనలేదన్నారు. 

Updated Date - 2021-08-01T08:52:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising