ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజకీయ నేతగా నిమ్మగడ్డ

ABN, First Publish Date - 2021-01-24T08:12:02+05:30

రాజ్యాంగ వ్యవస్థను నడిపే వ్యక్తిలా కాకుండా రాజకీయ నేతగా, పార్టీ నాయకుడిగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమే్‌షకుమార్‌ వ్యవహరిస్తూ రాజ్యాంగ వ్యవస్థకే మచ్చ తెస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నీవేనా ప్రాణాలు.. ప్రజలవి కాదా!?..

ఎస్‌ఈసీపై మంత్రి బొత్స ఆగ్రహం


నెల్లూరు, జనవరి 23: రాజ్యాంగ వ్యవస్థను నడిపే వ్యక్తిలా కాకుండా రాజకీయ నేతగా, పార్టీ నాయకుడిగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమే్‌షకుమార్‌ వ్యవహరిస్తూ రాజ్యాంగ వ్యవస్థకే మచ్చ తెస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. శనివారం నెల్లూరులో మాట్లాడారు. ఎన్నికల కమిషనర్‌కి అధికారం, బాధ్యత ఉంటాయని రెండింటినీ సమన్వయం చేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుందన్నారు. అయితే, నిమ్మగడ్డ ప్రెస్‌మీట్‌ చూస్తే ఆయన బాధ్యతను మరిచి అధికారాన్ని చలాయించేలా ఉందన్నారు. పంచాయతీరాజ్‌ శాఖ కార్యదర్శి కూడా ఎన్నికల కమిషనరేనన్న విషయాన్ని మరచి మాట్లాడటం సమంజసం కాదన్నారు. కేవలం విలేకరుల సమావేశంలో మాట్లాడేందుకు నిమ్మగడ్డ అద్దాన్ని అడ్డంపెట్టి ఎన్నో జాగ్రత్తలు పాటించారని, అంటే ఆయనొక్కక్కడికేనా ప్రాణం, ప్రజలు, అధికారులు, ఉద్యోగులవి ప్రాణాలు కావా? అని ప్రశ్నించారు. ఈ ఎన్నికలు ఆయన సామాజిక వర్గం కోసమా..? పదవి ఇచ్చిన చంద్రబాబు కోసమా? చెప్పాలన్నారు. 

Updated Date - 2021-01-24T08:12:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising