ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనలో వెలుగులోకి కొత్త అంశం

ABN, First Publish Date - 2021-12-16T01:33:19+05:30

ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనలో కొత్త అంశం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పశ్చిమ గోదావరి: ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనలో కొత్త అంశం వెలుగులోకి  వచ్చింది. ఆర్టీసీ బస్సుకు 20 రోజులుగా మెయింటెనెన్స్ లేదని ఫిర్యాదులు వచ్చాయి. జంగారెడ్డిగూడెం డిపోలో ఈ ఆర్టీసీ బస్సు స్టీరింగ్ పట్టేస్తుందంటూ డ్రాఫ్ట్ షీట్‌లో నమోదు చేశారు. మరమ్మతులు చేయాలంటూ ఎన్నోసార్లు విన్నవించినా అధికారులు పట్టించుకోలేదని ఆర్టీసీ సిబ్బంది ఆరోపణలు చేస్తున్నారు. డ్రైవర్ చిన్నారావు మృతికి బస్సు మెయింటెనెన్స్ లోపమే కారణమంటూ ఆర్టీసీ జోన్ చైర్ పర్సన్ తాతినేని పద్మావతికి సిబ్బంది ఫిర్యాదు చేశారు. ఆర్టీసీ బస్సు ప్రమాద సమయంలో డ్రైవర్‌కు గుండెపోటు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. డ్రైవర్ ఆరోగ్య పరిస్థితిపై విచారణ జరుపుతామన్న ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపారు. 



పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బుధవారం జంగారెడ్డిగూడెం సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి జల్లేరు వాగులో పడిన సంగతి తెలిసిందే. బస్సు రెయిలింగ్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు మృతి చెందగా... పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు ఉన్నారు.  


Updated Date - 2021-12-16T01:33:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising