ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘నిన్ను చూసుకోమని సీఎం చెప్పారు కదా.. నువ్వు ఇంత మెతక అయితే ఎలా!?’

ABN, First Publish Date - 2021-02-02T05:21:33+05:30

సోమవారం ఉదయం జరిగిన ఈ సమావేశంలో..

జిల్లాకు చెందిన ఎమ్మెల్యే, నేతలతో మాట్లాడుతున్న మంత్రులు బాలినేని, సజ్జల, పెద్దిరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వార్‌ వన్‌సైడ్‌!?

మంత్రి గౌతమ్‌ నివాసంలో హాట్‌.. హాట్‌గా వైసీపీ సమావేశం

బాలినేని, పెద్దిరెడ్డి, సజ్జల ఎదుట ఎమ్మెల్యేల మండిపాటు

మంత్రి అనిల్‌పై ఆగ్రహావేశం

సీఎం సభలో తీరని అవమానం : ఆనం

ఎన్నికలు మా చేత కాదు.. మీరే చేసుకోండి : రామిరెడ్డి

ఏం చేస్తున్నావంటూ గౌతమ్‌ను ప్రశ్నించిన మంత్రి బాలినేని

ఇంత మెతక అయితే ఎలా అంటూ వ్యాఖ్యలు

పంచాయతీ ఎన్నికల్లో కలిసికట్టుగా పని చేయాలని హితబోధ


జిల్లాలో మాకు (ఎమ్మెల్యేలకు) ఏం గౌరవం ఉందని ఈ సమావేశానికి పిలిచారు. ఒకరిద్దరికికి పెత్తనం ఇచ్చి...అంతా నాశనం చేసిపెట్టారు. 

- వైసీపీలో సీనియర్‌ నాయకుడి ఆగ్రహమిది. 


ఎప్పటినుంచో పార్టీని కనిపెట్టుకొని ఉన్న వారిని కాదని నిన్న మొన్న పార్టీలో చేరిన వారిని సీఎం సభ స్టేజీపైకి ఎక్కించారు. ఎమ్మెల్యేలను తోసి పడేశారు. ఇది ఈ జిల్లాలో మాకున్న గౌరవం.

- మరో ఎమ్మెల్యే ఆవేదన


ఎందుకు ఇలా అయింది!?. వైసీపీకి ఏకపక్షంగా ఉన్న జిల్లాను నాశనం చేసి పెట్టారు.

- పక్క జిల్లా మంత్రి ఆశ్చర్యం


ఏం గౌతం..! జిల్లా బాధ్యతలు చూసుకోమని సీఎం నీకు చెప్పారు కదా. ఇంత మెతకైతే కుదరదు. 

- జిల్లా బాధ్యతలు చూసే ఓ మంత్రి నిట్టూర్పు


పాపం.. చెప్పుకోవడానికి గౌతం సిగ్గుపడుతున్నాడు. ఆయన ఒకేఒక పేరు చెప్పారు. ఆ వ్యక్తిని కూడా సీఎం సభ స్టేజీ మీదకు ఎక్కించలేదు. 

- జిల్లాకు చెందిన మాజీ మంత్రి వ్యాఖ్య


గతంలో సీఎంలు జిల్లాలోని సీనియర్లను పిలిపించుకొని అధికారులను నియమించేవారు. ఇప్పుడు ఒకరిద్దరితో మాట్లాడి అధికారులను వేస్తున్నారు. వాళ్లు మా నెత్తినెక్కి తొక్కుతున్నారు. తీరని అవమానం చేస్తున్నారు. మేము ఎవరితో చెప్పుకోవాలి, జనంలో ఏమని తిరగాలి. 

- మరో శాసన సభ్యుని ఎదురుదాడి....


అధికార వైసీపీలో వార్‌ వన్‌సైడ్‌ అయ్యింది అనడానికి ఈ మాటలే నిదర్శనం. నెల్లూరులో సోమవారం మంత్రి మేకపాటి గౌతంరెడ్డి నివాసంలో పొరుగు జిల్లాలకు చెందిన ముగ్గురు మంత్రుల ఎదుట జిల్లాకు చెందిన అధికార పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలు గమనిస్తే జిల్లా నేతల్లో ఒకరు ఒకవైపు మిగిలిన వారందరు మరోవైపు అన్నట్టు స్పష్టం అవుతోంది. నెల్లూరులోని గౌతంరెడ్డి నివాసంలో పంచాయతీ ఎన్నికల సన్నాహక సమావేశం ఎంత వేడిగా జరిగిందో నాయకుల మాటల్లో పెల్లుబికినపై ఆవేదనాగ్రహ పూరిత వ్యాఖ్యలే నిదర్శనం. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు  ఆ వివరాల్లోకి వెళితే...


నెల్లూరు,  (ఆంధ్రజ్యోతి): సోమవారం ఉదయం జరిగిన ఈ సమావేశంలో అమ్మఒడి రెండో విడత ప్రారంభోత్సవం సందర్భంగా నెల్లూరులో జరిగిన సీఎం బహిరంగ సభలో చోటు చేసుకున్న పరిణామాలే ప్రధాన చర్చగా మారినట్లు తెలిసింది. ప్రభుత్వ సలహాదారు సజ్జల, జిల్లా ఇన్‌చార్జి మంత్రి బాలినేని శ్రీనివాస్‌, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిల అధ్యక్షతన సోమవారం ఉదయం మంత్రి గౌతంరెడ్డి నివాసంలో పంచాయతీ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి మినహా మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ద్వితీయశ్రేణి నాయకులు హాజరయ్యారు. ఇన్‌చార్జి మంత్రి బాలినేని శ్రీనివాస్‌ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో అందరూ సమష్టిగా పని చేయాలని, ఫలితాలు ఏకపక్షంగా ఉండాలంటూ మొదలు పెట్టారు. 


ఆనం ఆగ్రహం

దీనిపై వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ ఎదురుదాడి మొదలు పెట్టారు. ఈ జిల్లాలో ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఏం విలువ ఉందని మమ్మల్ని ఈ సమావేశానికి పిలిచారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్న జరిగిన సీఎం సభలో ఎమ్మెల్యేలకు తీరని అవమానం జరిగిందని మండిపడ్డారు. తాము సూచించిన పేర్లలో ఒక్కరిని కూడా స్టేజీపైకి ఎక్కించలేదన్నారు. ఎమ్మెల్యేలను, మంత్రి గౌతంరెడ్డిని ఒకదారిలో మరో మంత్రి (అనిల్‌)ని సీఎం కాన్వాయ్‌ నడిచే దారిలో పంపారన్నారు. తన సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఇలా ఎప్పుడూ చూడలేదన్నారు. ఎమ్మెల్యేలను పోలీసులు నెట్టివేశారన్నారు. రిపబ్లిక్‌ డే వేడుకలకు ఎమ్మెల్యేలకు కనీసం ఆహ్వానం కూడా ఇవ్వలేదని, ఇంత అవమానం ఎప్పుడైనా, ఎక్కడైనా జరిగిందా అని ఆనం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి కారణం ఎవరు..?  జిల్లాకు చెందిన వారు కదా...! అని ప్రశ్నించారు. 


మొన్న చేరిన వారికే అందలమా!?

కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న వారిని పక్కన పెట్టి నిన్న.. మొన్న పార్టీలో చేరిన వారిని సీఎం సభ స్టేజీపైకి ఎక్కించారని మండిపడ్డారు. ఎన్నికలకు ముందే ఎస్పీని బదిలీ చేయమని చెప్పినా పట్టించుకోలేదని, ఒకరి కోసం ఆయన్ను ఇక్కడే ఉంచారని, ఇలాంటి ఆఫీసర్‌ను పెట్టుకొని తాము ఎలా ఎన్నికలు చేయగలం, మా చేత కాదు, మీరే చేసుకోండి అని పలువురు నాయకులు ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. 


ఇంత మెతక అయితే ఎలా!?

దీనిపై జిల్లా ఇన్‌చార్జి మంత్రి బాలినేని.. మేకపాటి గౌతంరెడ్డితో మాట్లాడుతూ ఏం.. గౌతం, జిల్లా బాధ్యతలను నిన్ను చూసుకోమని సీఎం చెప్పారు కదా! నువ్వు ఇంత మెతక అయితే ఎలా!? అని ప్రశ్నించినట్లు తెలిసింది. దీనిపై ఆనం మాట్లాడుతూ పాపం.. మా గౌతం చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాడు, సీఎం సభ స్టేజీపైకి అనుమతించమని ఆయన ఒకేఒక పేరు ఇచ్చాడు. ఆ ఒక్కరిని కూడా స్టేజీపైకి ఎక్కనివ్వలేదు. .అనగా.... దీనిపై అవునా..! అని బాలినేని గౌతంను అడగటం.. ఆయన మౌనం దాల్చినట్లు సమాచారం.


జిల్లాను ఎందుకు ఇలా చేశారు!?

మంత్రి పెద్దిరెడ్డి జోక్యం చేసుకొని ఏకపక్షంగా ఉన్న జిల్లా ఎందుకు ఇలా తయారయ్యిందని, ఎంతో మంది సీనియర్లు, పెద్దలు ఉన్న జిల్లా ఇది, అందరూ సర్దుకొని వెళ్లండి, ఒకరినొకరు గౌరవించుకొని ముందుకు సాగాలని సూచించినట్లు తెలిసింది. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటామని, అధికారుల నియామకాలు, బదిలీల విషయంలో అందరి అభిప్రాయాలు తీసుకుంటామని బాలినేని, సజ్జల హామీ ఇవ్వడంతో పరిస్థితి సద్దుమణిగినట్లు తెలిసింది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా వాడి, వేడిగా సాగిన ఈ అంతర్గత సమావేశం జిల్లాలో హాట్‌ టాపిక్‌గా మారింది. 


Updated Date - 2021-02-02T05:21:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising