ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలి

ABN, First Publish Date - 2021-01-19T05:23:35+05:30

వ్యవసాయ రంగానికి నష్టం కలిగించే చట్టాలను కేంద్రం వెంటనే రద్దు చేయాలని కోరుతూ మహిళా సంఘాల ఐక్యవేదిక(ఐద్వా) ఆధ్వర్యంలో ఆ చట్టాల ప్రతులను దహనం చేశారు.

చట్టాల ప్రతులను దహనం చేస్తున్న మహిళా నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐద్వా ఆధ్వర్యంలో ప్రతుల దహనం 

నెల్లూరు(వైద్యం), జనవరి 18 : వ్యవసాయ రంగానికి నష్టం కలిగించే చట్టాలను కేంద్రం వెంటనే రద్దు చేయాలని కోరుతూ  మహిళా సంఘాల ఐక్యవేదిక(ఐద్వా) ఆధ్వర్యంలో ఆ చట్టాల ప్రతులను దహనం చేశారు. సోమవారం నెల్లూరులోని గాంధీబొమ్మ వద్ద  ఐద్వా ఆధ్వర్యంలో మహిళలు నిరసన తెలిపారు. రైతుల పోరాటానికి మద్దతుగా మానవహారం ఏర్పాటు చేశారు. ఐద్వా జిల్లా అధ్యక్షురాలు షేక్‌ మస్తాన్‌బీ, శ్రామిక మహిళ కన్వీనర్‌ అన్నపూర్ణమ్మ మాట్లాడుతూ ఎముకలు కొరికే చలిలో సైతం ఢిల్లీలో పోరాటం చేస్తున్న రైతులకు తోడుగా మహిళలు కూడా ఉద్యమంలో పాల్గొంటున్నారని చెప్పారు. ఈ ఉద్యమంలో అనేక మంది రైతులు మృత్యువాత పడినా కేంద్ర ప్రభుత్వంలో చలనం లేదని విమర్శించారు. రైతు చట్టాలను రద్దు చేసే వరకు మహిళా సంఘాలు ఉద్యమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నగర అధ్యక్షురాలు పద్మ, సుబ్బమ్మ, పుష్ప, రమణమ్మ పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-19T05:23:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising