ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళా సంరక్షణ కార్యదర్శులు పోలీసులే..! : ఎస్పీ

ABN, First Publish Date - 2021-07-27T05:10:36+05:30

మహిళా సంరక్షణ కార్యదర్శులు కూడా పోలీసు శాఖలో భాగమే అని ఎస్పీ సీహెచ్‌ విజయరావు పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో గ్రామ, వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శుల (మహిళా పోలీసులు) విధివిధానాలపై పోలీసు అధికారులతో ఎస్పీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు(క్రైం), జూలై 26:  హిళా సంరక్షణ కార్యదర్శులు కూడా పోలీసు శాఖలో భాగమే అని ఎస్పీ సీహెచ్‌ విజయరావు పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో గ్రామ, వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శుల (మహిళా పోలీసులు) విధివిధానాలపై పోలీసు అధికారులతో ఎస్పీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. మహిళా కార్యదర్శులు ఇక నుంచి గ్రామ, వార్డు సచివాలయానికి సమీపంలోని పోలీసు స్టేషన్‌కు ప్రతినిఽధులుగా వ్యవహరించే విఽధంగా చర్యలు తీసుకోవాలన్నారు. దిశా యాప్‌ను యువతులు, మహిళలు డౌన్‌లోడ్‌ చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. గ్రామాల్లో చట్టవిరుద్ధ, అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌బీ డీఎస్పీ  కోటారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, నెల్లూరులోని ఓవెల్‌ జూనియర్‌ కళాశాలలో నగర డీఎస్పీ శ్రీనివాసులురెడ్డి సోమవారం దిశ యాప్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థినులు, మహిళలకు ఆ యాప్‌, దాని వినియోగం, ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఓవెల్‌ విద్యాసంస్థల చైర్మన్‌ వేణు, దర్గామిట్ట ఎస్‌ఐ విజయకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-27T05:10:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising