ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అసలేం జరిగింది!?

ABN, First Publish Date - 2021-04-24T04:56:38+05:30

నెల్లూరుకు చెందిన కొండ్రెడ్డి సుబ్బులును ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలానికి చెందిన తమ బంధువు కొండ్రెడ్డి బాబుకు 11 ఏళ్ల క్రితం ఇచ్చి వివాహం చేశారు.

మృత్యువాత పడ్డ తల్లీకూతుళ్లు కొండ్రెడ్డి సుబ్బులు, మధురవాణి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాతృమూర్తి కఠిన నిర్ణయం వెనుక మిస్టరీ ఏంటి!

తల్లీకూతుళ్ల మృతిపై తలెత్తుతున్న అనుమానాలెన్నో!?

పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నామంటున్న పోలీసులు 


అసలేం జరిగింది!? నవమాసాలు మోసి కనిపెంచిన బిడ్డలను చంపి తనూ తనువు చాలించాలనుకున్న మాతృమూర్తి కఠిన నిర్ణయం వెనుక మిస్టరీ ఏమిటి!?. రెండేళ్లుగా పుట్టినింటికి రాని ఆమె ఉన్నట్టుండి బయలుదేరడం.. మార్గమధ్యంలోనే బస్సు దిగి కూతురితోపాటు ఆగ్నికి ఆహుతి కావడం వెనుక ఎన్నో అనుమానాలు రేగుతున్నాయి.  బళ్లారిలో ఉన్న భర్త వస్తే తప్ప అసలు విషయాలు వెలుగులోకి రావు. అయితే, పోలీసుల మాత్రం దర్యాప్తును వేగవంతం చేశారు.

నెల్లూరుకు చెందిన కొండ్రెడ్డి సుబ్బులును  ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలానికి చెందిన తమ బంధువు కొండ్రెడ్డి బాబుకు 11 ఏళ్ల క్రితం ఇచ్చి వివాహం చేశారు. వీరికి కుమారుడు మహేష్‌బాబు (6), కుమార్తె మధురవాణి(4) ఉన్నారు. బళ్లారి ప్రాంతంలోని సరిగిరి మండలంలో అంజీరా తోటను ఈ దంపతులు లీజుకు తీసుకుని జీవిస్తున్నారు. అయితే, అయితే, గురువారం రాత్రి కొండ్రెడ్డి సుబ్బులు తన ఇద్దరు బిడ్డలను వెంటబెట్టుకుని తన పుట్టినిల్లు నెల్లూరుకు బస్సులో బయలుదేరింది. శుక్రవారం తెల్లవారుజాము 3.45 గంటలకు ఆత్మకూరు సమీపంలో నెల్లూరుపాళెం సెంటర్‌లో బస్సు దిగింది. సమీపంలో ఉన్న శ్మశానంలోకి వెళ్లి బిడ్డలపై శానిటైజర్‌ పోసి తాను నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అదృష్టవశాత్తు ఆమె కుమారుడు మహేష్‌బాబు అక్కడ నుంచి బయటపడ్డాడు. నెల్లూరుకు వెళ్లాల్సిన ఆమె అర్ధంతరంగా నెల్లూరుపాళెంలో ఎందుకు దిగిందనే అనుమానాలు కలుగుతున్నాయి. ఏదో బలమైన కారణం ఉంటే తప్ప బిడ్డలను చంపి తనూ చావాలని ఏ మాతృమూర్తి యోచించదు. ఆ బలమైన కారణం ఏమిటనేది మిస్టరీగా మారింది. రెండేళ్లుగా ఆమె తన పుట్టినింటికి రాలేదని ఆమె సమీప బంధువులు చెబుతున్నారు. అలాంటిది ఇప్పుడెందుకు పుట్టినింటికని బయలుదేరి బలవన్మరణానికి పాల్పడిందనే అనుమానాలు లేకపోలేదు. ఏది ఏమైనా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమె భర్తను పూర్తిస్థాయిలో విచారించడంతోపాటు వారి ఫోన్‌కాల్స్‌ లిస్ట్‌ను నిశితంగా పరిశీలిస్తే కొన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని పోలీసులు  చెబుతున్నారు. ప్రస్తుతానికి ఆ తల్లీబిడ్డల బలవన్మరణానికి గల వివరాలు పూర్తిగా తెలియలేదు. అయితే కేసును పూర్తిస్థాయిలో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రవినాయక్‌ తెలిపారు.

Updated Date - 2021-04-24T04:56:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising