ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

363 ఆర్‌బికేల్లో మాత్రమే ఏహెచ్‌ఏల నియామకం

ABN, First Publish Date - 2021-04-13T03:43:08+05:30

: జిల్లాలో 620 రైతు భరోసా కేంద్రాలుండగా, ఇప్పటికీ 363లో మాత్రమే గ్రామ పశువైద్యసహాయకుల(అనిమల్‌ హస్‌బెండరీ అసిస్టెంట్‌)ను ని

: వైద్యసిబ్బందితో మాట్లాడుతున్న పశుసంవర్థకశాఖ జేడీ వెంకటస్వామిరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 పశుసంవర్ధక శాఖ జేడీ వెంకటస్వామిరెడ్డి

 మనుబోలు, ఏప్రిల్‌ 12: జిల్లాలో 620 రైతు భరోసా కేంద్రాలుండగా, ఇప్పటికీ 363లో మాత్రమే గ్రామ పశువైద్యసహాయకుల(అనిమల్‌ హస్‌బెండరీ అసిస్టెంట్‌)ను నియమించామని జిల్లా పశుసంవర్ధకశాఖ సంయుక్త సం చాలకులు వెంకటస్వామిరెడ్డి తెలిపారు. స్థానిక పశువైద్యశాల లో సోమవారం ఏహెచ్‌ఏలు, పశువైద్యాధికారులతో సమావే శం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగు, ఐదు గ్రామాలకు కలిపి ఒక పశువైద్యశాల ఉం టుందన్నారు. కావున ఆర్‌బికేల్లో ఏర్పాటు చేసిన ఏహెచ్‌ఏలు క్షేత్రస్థాయిలో వైద్యం అందిస్తారన్నారు. ప్రభుత్వం వైద్యశాలల పనివేళలు మార్చిందన్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5వరకు పనిచేస్తాయన్నారు. ఆర్‌బికేలో వ్యవసాయ సహాయ కులతోపాటు పశువైద్య సహాయకులు ఉంటారన్నారు. ఈ అవకాశాన్ని పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లాలో ఇంకా 4వేల యూనిట్లకు పశునష్టపరిహారం అందాల్సి ఉందన్నారు. దాణా అయితే కేవలం ఎస్సీ, ఎస్టీ పాడి రైతులకు మాత్రమే సబ్సిడీ కింద ఇస్తున్నామన్నారు.  కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్‌ నరసింహారావు, ఏడి గురవారెడ్డి, వైద్యులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-13T03:43:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising