వెంగమాంబను దర్శించుకున్న భక్తులు
ABN, First Publish Date - 2021-08-06T04:43:47+05:30
జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన దుత్తలూరు మండలం నర్రవాడ గ్రామంలో వెలసి ఉన్న వెంగమాంబ పేరంటాలమ్మను గురువారం భక్తులు అధికసంఖ్యలో
దుత్తలూరు(ఉదయగిరి రూరల్), ఆగస్టు 5: జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన దుత్తలూరు మండలం నర్రవాడ గ్రామంలో వెలసి ఉన్న వెంగమాంబ పేరంటాలమ్మను గురువారం భక్తులు అధికసంఖ్యలో దర్శించుకున్నారు. అమ్మవారి నెల పొంగళ్లు ముగిసిన అనంతరం వచ్చిన మొదటి గురువారం కావడంతో భక్తులు పోటెత్తారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలి మండలి చైర్మన్ పచ్చవ కరుణాకర్‌బాబు, ఆలయ కార్యనిర్వాహణాధికారి రాచకుంట వెంకటేశ్వర్లు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎస్‌ఐ జంపాని కుమార్ పోలీసు బందోబస్తు నిర్వహించారు.
Updated Date - 2021-08-06T04:43:47+05:30 IST