ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరద బాధితులను ఆదుకుంటాం

ABN, First Publish Date - 2021-11-22T03:51:32+05:30

వరద కారణంగా పంట నష్టపోయిన రైతులు, జలదిగ్బంధంలో ఉన్న ప్రజలను ఆదుకుంటామని ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్‌రావు అన్నారు.

దెబ్బతిన్న ఆర్‌అండ్‌బీ రోడ్డును పరిశీలిస్తున్న ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్‌రావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోట, నవంబరు 21 : వరద కారణంగా పంట నష్టపోయిన రైతులు,  జలదిగ్బంధంలో ఉన్న ప్రజలను ఆదుకుంటామని ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్‌రావు అన్నారు. మండల పరిధిలోని కర్లపూడిలో దెబ్బతిన్న ఆర్‌అండ్‌బి రోడ్డు, నీట మునిగిన పంటపొలాలను  అధికారులతో కలసి ఆయన శనివారం పరిశీలిం చారు. స్థానికంగా ఉన్న రెండు గిరిజన కాలనీలు, దళితవాడ వరదనీటిలో జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో ఎమ్మెల్యే ఆయా వాడలకు వెళ్లి వరద బాధితులను పరామర్శిం చారు. తక్షణ సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.  చల్లకాలువ వంతెన, దెబ్బతిన్న ఆర్‌అండ్‌బీ రోడ్ల ను పరిశీలించారు. తాత్కాలిక మరమ్మతులు చేయాలని అధికా రులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ కన్వీనర్‌ పలగాటి సంపత్‌కుమార్‌, వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నల్లపరెడ్డి వినోద్‌రెడ్డి, బిట్‌-2 ఎంపీటీసీ సభ్యుడు మోబిన్‌బాషా, యువజన విభాగం నాయకులు చిల్లకూరు సాయిప్రసాద్‌రెడ్డి, చిల్లకూరు దశరఽథరామిరెడ్డి, నరమాల వెంకటరమణయ్య, గాది భాస్కర్‌ తదితరులు ఉన్నారు. 

హైలెవెల్‌ వంతెన నిర్మాణానికి చర్యలు

చిల్లకూరు: తిప్పగుంటపాళెంలోని ఉప్పుటేరుపై హైలెవెల్‌ వంతెన నిర్మాణానికి చర్యలు తీసుకుంటా మని ఎమ్మెల్వే వరప్రసాద్‌రావు తెలిపారు. ఆదివారం జలదిగ్బంధంలో ఉన్న తిప్ప గుంటపాళెం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ వంతెన నిర్మాణం అంశాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లా మన్నారు. తహసీల్దారు రవీంద్రబాబు, జడ్పీటీసీ సభ్యుడు మన్నెం శీనయ్య, అన్నంరెడ్డి పరంధామ రెడ్డి, యలంటి సనత్‌కుమార్‌రెడ్డి, వేణురెడ్డి  పాల్గొన్నారు.

Updated Date - 2021-11-22T03:51:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising