ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వంతెనల నిర్మాణాలపై కలెక్టర్‌ పరిశీలన

ABN, First Publish Date - 2021-12-02T05:11:50+05:30

గూడూరు-మనుబోలు మధ్య జాతీయ రహదారిపై వంతెనల నిర్మాణాల పనులను కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు, ఎస్పీ విజయరావు బుధవారం ఆదిశంకర కళాశాల వద్ద పరిశీలించారు.

హైవే పనుల గురించి పీడీతో మాట్లాడుతున్న కలెక్టర్‌ కేవీఎన్‌. చక్రధర్‌బాబు, పక్కన గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్‌రావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 వరదలో నడిచివెళ్లిన ఎస్పీ 

ఎమ్మెల్యేలతో చర్చించిన కలెక్టర్‌ 


మనుబోలు, డిసెంబరు 1: గూడూరు-మనుబోలు మధ్య జాతీయ రహదారిపై వంతెనల నిర్మాణాల పనులను కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు, ఎస్పీ విజయరావు బుధవారం ఆదిశంకర కళాశాల వద్ద పరిశీలించారు. ఎప్పటి నుంచి పనులు జరుగుతున్నాయి, ఎప్పటికీ పూర్తి చేస్తారన్న అంశాలపై హైవే ప్రాజెక్టు డైరెక్టర్‌ గోవర్ధన్‌ను అడిగి తెలుసుకున్నారు. అలాగే వరద ఉధృతిని పరిశీలించారు. ప్రజలకు, ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ కిందిస్థాయి అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్‌ లారీ ఎక్కి వరదను దాటుకుని గూడూరుకు వెళ్లారు అలాగే ఎస్పీ విజయరావు సిబ్బందితో వరద లోతు పరిశీలించేందుకు నడుచుకుంటూ అవతలికి వెళ్లారు. అంతకు మునుపు కలెక్టర్‌ చక్రధర్‌బాబు ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి, గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్‌రావుతో హైవే నిర్మాణ పనులు, వరదలు, ట్రాఫిక్‌ గురించి చర్చించారు.  కార్యక్రమంలో గూడూరు తహసీల్దారు లీలారాణి, మనుబోలు తహసీల్దారు నాగరాజు, ఏఎస్పీ వెంకటరత్నం, డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి, సీఐ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. 




Updated Date - 2021-12-02T05:11:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising