ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వణికిపోతున్న ఉదయగిరి

ABN, First Publish Date - 2021-09-14T05:29:47+05:30

చాపకింద నీరులా కరోనా విశ్వరూపం చూపిస్తున్న తరుణంలో వాతావరణంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా వైరల్‌ జ్వరాలు విజృంభిస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఓవైపు కరోనా.. మరోవైపు జ్వరాలు


ఉదయగిరి రూరల్‌, సెప్టెంబరు 13 : చాపకింద నీరులా కరోనా విశ్వరూపం చూపిస్తున్న తరుణంలో వాతావరణంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా వైరల్‌ జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఎవరికి ఏ జ్వరమో తెలియక ప్రజలు హడలిపోతున్నారు. షబ్బీర్‌ కాలనీ, దిలావర్‌భాయ్‌వీధి, దేవలాలగడ్డ, యాదవపాళెంతోపాటు మండలంలోని పలు గ్రామాల్లో వారం రోజులుగా జ్వరాలు విజృంభిస్తున్నాయి. పట్టణంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో కొన్ని రోజులుగా పాక్షిక లాక్‌డౌన్‌ అమలులో ఉంది. ఇదిచాలదన్నట్టుగా జ్వరాలు సోకుతున్నాయి. రోజుల తరబడి జ్వరం తగ్గకపోవడంతో ఆత్మకూరు, నెల్లూరుకు తరలిపోతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత వైద్య ఆరోగ్య సిబ్బంది స్పందించి జ్వరాలను అదుపులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. 


141 పాజిటివ్‌లు.. ఇద్దరు మృతి 

నెల్లూరు (వైద్యం) : జిల్లాలో సోమవారం కరోనా కేసులు 141కు చేరుకున్నాయి. దీంతో మొత్తం పాజిటివ్‌ల సంక్య 1,42,659లుగా నమోదయ్యాయి. ఇక వైరస్‌ నుంచి కోలుకోలేక ఇద్దరు మృతి చెందగా, కోలుకున్న 61 మందిని అధికారులు డిశ్చార్జ్‌ చేశారు. మరోవైపు 230 మందికి వైద్యసిబ్బంది వ్యాక్సిన్‌ వేశారు.

Updated Date - 2021-09-14T05:29:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising