ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్పొరేట్‌ ఆసుపత్రుల్లోనూ వ్యాక్సిన్‌

ABN, First Publish Date - 2021-01-22T05:27:50+05:30

నెల్లూరులోని కార్పొరేట్‌ ఆసుపత్రులలోనూ కరోనా టీకా వేయనున్నట్లు కలెక్టర్‌ చక్రధర్‌బాబు తెలియచేశారు.

అపోలోలో వ్యాక్సినేషన్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌ చక్రధర్‌బాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరులో ప్రారంభించిన కలెక్టర్‌ 


నెల్లూరు(వైద్యం) జనవరి 21 : నెల్లూరులోని కార్పొరేట్‌ ఆసుపత్రులలోనూ కరోనా టీకా వేయనున్నట్లు కలెక్టర్‌ చక్రధర్‌బాబు తెలియచేశారు. గురువారం అపోలో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో కరోనా టీకాను ప్రారంభించారు. అపోలోతోపాటు మెడికవర్‌, సింహపురి ఆసుపత్రులలో కరోనా టీకా వేసేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. మొదటి విడత పూర్తి కాగానే రెండవ విడత ప్రారంభిస్తామని చెప్పారు. ఇందులో పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్‌, మున్సిపల్‌, సచివాలయ సిబ్బందితోపాటు ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు వ్యాక్సిన్‌ వేయనున్నట్లు చెప్పారు. మొదటి సారి టీకా వేయించుకున్న వారు తప్పనిసరిగా రెండవ దఫా టీకా వేయించు కోవాలని సూచించారు. ఆ తర్వాత 14 రోజులకు యాంటీబాడీస్‌ ఉత్పత్తి అవుతాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో రాజ్యలక్ష్మి, అపోలో ఆసుపత్రి హెడ్‌ నవీన్‌, సూపరింటెండెంట్‌ శ్రీరామ్‌ సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.  


3072 మందికి టీకా 


జిల్లాలో గురువారం 3072 మందికి కరోనా టీకా వేశారు. దీంతో మొత్తం టీకా వేసుకున్న వారి సంఖ్య 11,498లకు చేరుకుంది. మందికి కరోనా టీకా వేశారు. నారాయణ, అపోలో, మెడికవర్‌, కిమ్స్‌ ఆసుపత్రులలోనూ వ్యాక్సినేషన్‌ ప్రారంభించగా, ఆయా ఆసుపత్రుల ప్రతినిధులు టీకా వేయించుకున్నారు.  కాగా జిల్లాలో గురువారం 5 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 63,840లకు చేరుకుంది. కరోనా నుంచి కోలుకున్న 15 మంది బాధితులను అధికారులు డిశ్చార్జ్‌ చేశారు.

Updated Date - 2021-01-22T05:27:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising