ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపా చట్టాన్ని రద్దు చేయాలి

ABN, First Publish Date - 2021-02-28T03:58:00+05:30

ప్రాథమిక హక్కులకు వ్యతిరేకమైన ఉపా చట్టాన్ని తక్షణం రద్దు చేయాలని పౌరహక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్‌ డిమాండు చేశారు.

- ఉపన్యసిస్తున్న పౌరహక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పౌరహక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌

నెల్లూరు(సాంస్కృతిక, ప్రతినిధి), ఫిబ్రవరి 27 : ప్రాథమిక హక్కులకు వ్యతిరేకమైన ఉపా చట్టాన్ని తక్షణం రద్దు చేయాలని పౌరహక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్‌ డిమాండు చేశారు. పిడుగురాళ్లలో 40 మందిపై బనాయించిన ఉపా చట్టం ఎత్తివేయాలని కోరుతూ శనివారం నగర పురమందిరంలోని రీడింగ్‌ హాలులో నిరసన సభ జరిగింది. పౌరహక్కుల సంఘం, ఓపీడీఆర్‌ కుల నిర్మూలన పోరాట సమితి, ఐఎఫ్‌టీయూ, పీవోడబ్ల్యూ, పీడీఎస్‌యూ, చైతన్య మహిళా సంఘం, పీడీఎం, పీకేఎస్‌, ఏపీఎల్‌, విరసం ఆధ్వర్యంలో ఈ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్‌ మాట్లాడుతూ ప్రజల కోసం, హక్కుల కోసం కార్మిక, కర్షక, దళిత, కళారంగాలకు చెందిన 40మందిపై పెట్టిన అక్రమ కేసులను తక్షణం ఎత్తివేయాలన్నారు. సభకు జిల్లా పౌరహక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు, న్యాయవాది అబ్బాయిరెడ్డి అధ్యక్షత వహించారు. రాష్ట్ర నాయకులు కృష్ణ, వై.వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి శ్రీమన్నారాయణ, సీఐటీయూ నాయకుడు అజయ్‌కుమార్‌, తన్నీరు కోటయ్య, ఎల్లంకి వెంకటేశ్వర్లు, సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2021-02-28T03:58:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising