ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రమాదపుటంచున ప్రయాణం!

ABN, First Publish Date - 2021-12-22T04:09:31+05:30

ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకొన్న ప్రమాద ఘటన ఈ ప్రాంత వాసుల ను సైతం ఆందోళనకు గురి చేస్తోంది.

చెరువు మధ్యలో ఉన్న రహదారిపై ఎదురుగా వస్తున్న వాహనం కోసం ఆగిన మరో వాహనం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రక్షణ గోడ లేని రహదారి

రహదారికి ఇరువైపుల నిండుకుండలా చెరువు

ఉదయగిరి రూరల్‌, డిసెంబరు 21: ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకొన్న ప్రమాద ఘటన ఈ ప్రాంత వాసుల ను సైతం ఆందోళనకు గురి చేస్తోంది. గత నెల రోజులుగా కురిసి న వర్షాలకు చెరువులు, జలాశయాలు నిండుకుండలా మారా యి. నీటి వనరులకు సమీపంలో ఉన్న రహదారులు, మార్జిన్‌లు సైతం ఛిద్రమై రాకపోకలకు తీవ్ర అంతరా యం కలగడంతోపాటు ప్రమాదాలకు నిలయంగా మారాయి. అందులో ప్రధానమైంది ఉదయగిరి-సీతారామపురం మార్గం. ఈ మార్గంలో కుర్రపల్లి వద్ద గల అత్తిచెట్లకుంట(చెరువు)కు మధ్యలో రహదారి వెళుతుండడం, రోడ్డుకు ఇరువైపులా నిండుకుండాల చెరువు ఉండడంతో ప్రమాదం పొంచి ఉంది. నీ టి ధాటికి మార్జిన్‌లు సైతం దెబ్బతిని రోడ్డు కుంచించుకుపోయింది. ఆ రహదారిపై బస్సు వస్తే అర కిలోమీటర్‌ దూరంలో వాహనాలు నిలపాల్సిందే. మార్జిన్‌లలో సమీపంలో ఉన్న చెరువు నీరు చేరి మోకాటిలోతు గుంతలతో దర్శనమిస్తున్నాయి. ఆదమరిస్తే వాహనాలు చెరువులోకి వెళ్తే పరిస్థితి. రహదారికి మధ్యలో ఉన్న వంతెన సైతం శిథిలావస్థకు చేరింది. రాత్రి సమయంలో నీరు కనిపించకపోవడం తో ప్రమాదాలు సంభవించే అవకాశముంది. ఇప్పటికైనా పాలకులు, అధికారులు ప్రమాదాలు జరగక ముందే రక్షణ గోడ నిర్మించడమా, సూచికలు ఏర్పాటు చేయడమా వంటి చర్యలు చేపట్టి ప్రమాదాలను నివారించాలని ప్రజలు కోరుతున్నారు. 




Updated Date - 2021-12-22T04:09:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising