ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్త ఆశలు.. ఆకాంక్షలు

ABN, First Publish Date - 2021-04-13T05:52:53+05:30

ఉగాది అంటేనే కొత్తదనం. కొత్త సంవత్సరం, కొత్త రుతువు, కొత్తమాసం.. కొత్త వాతావరణం. శిశిరంతో ఆకురాలి మోడువారిన వృక్షాలు వసంతంలో చిగుళ్లతో పచ్చదనా న్ని, నూతనత్వాన్ని సంతరించుకుంటాయి.

విద్యుద్దీపాలంకరణలో ఇరుకళల పరమేశ్వరి ఆలయం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


 నేడు ఉగాది

ఆలయాల్లో వేడుకలు, పంచాంగ శ్రవణం


నెల్లూరు(సాంస్కృతికం), ఏప్రిల్‌ 12 :  

ఉగాది అంటేనే కొత్తదనం. కొత్త సంవత్సరం, కొత్త రుతువు, కొత్తమాసం.. కొత్త వాతావరణం. శిశిరంతో ఆకురాలి మోడువారిన వృక్షాలు వసంతంలో చిగుళ్లతో పచ్చదనా న్ని, నూతనత్వాన్ని సంతరించుకుంటాయి. అలాగే నవ్య సంవత్సరంలో జీవితంలోకూడా కొత్త చిగుళ్లు తొడగాలని, ఉగాది పచ్చడిలాగే షడ్రుచులతో సుఖ సంతోషాలతో సాగాలని ప్రతి ఒక్కరు ఆకాంక్షిస్తారు.  

ప్లవనామ సంవత్సర ఉగాదికి జిల్లా ముస్తాబైంది. పల్లెలు, పట్టణాలు అన్న తేడా లేకుం డా ప్రజలు నూతన తెలుగు ఏడాదికి స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. పూజా సామగ్రి, నూతన వస్త్రాల కొనుగోళ్లు జరిపే వారితో పట్టణ బజార్లు సోమవారం కిటకిట లాడాయి. జిల్లా అంతటా ఆలయాల్లోనూ ఉగాది వేడుకలకు ఏర్పాట్లు చేశారు. విశేష అభిషేకాలు, పూజలు జరగనున్నాయి. అనంతరం కొత్త వత్సరంలో ప్రజల జీవనం, ప్రకృతి, పంటలు, పాలన, గ్రహస్థితి తదితరాలను తెలియజేస్తూ పంచాంగ శ్రవణం జరగనుంది. ఈ ఏడాది అయినా కరోనా పీడ త్వరగా తొలగిపోవాలని అందరూ ఆశిస్తున్నారు. కాగా, నెల్లూరులోని బాలాజీనగర్‌లో సింహపురి ధార్మిక సంస్థ నిర్వహించే పంచాంగ పూజలో హంపీ పీఠాధిపతి విద్యారణ్య భారతీస్వామి పాల్గొని ప్రవచించనున్నారు. 



Updated Date - 2021-04-13T05:52:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising