ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహాకవీ.. మన్నించు!!ఆలనా పాలనలేని తిక్కన పార్కు

ABN, First Publish Date - 2021-02-25T07:27:00+05:30

పెన్నా తీరంలోని తిక్కన పార్కు ఆలనా పాలనకు నోచుకోక అధ్వానంగా తయారైంది. సంస్కృత మహాభారతంలో సింహ భాగాన్ని మహాకవి తిక్కన ఆంధ్రీకరించిన ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనలు కార్యరూపానికి నోచుకోవడం లేదు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రతిష్ఠకు నోచుకోని కాంస్య విగ్రహం


నెల్లూరు(సాంస్కృతిక ప్రతినిధి), ఫిబ్రవరి 24 : పెన్నా తీరంలోని తిక్కన పార్కు ఆలనా పాలనకు నోచుకోక అధ్వానంగా తయారైంది. సంస్కృత మహాభారతంలో సింహ భాగాన్ని  మహాకవి తిక్కన ఆంధ్రీకరించిన ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనలు కార్యరూపానికి నోచుకోవడం లేదు. ఆహ్లాదకరంగా ఉండాల్సిన ఉద్యానవనం పశువుల కొట్టాంలా మారింది. చీకటి కార్యకలాపాలకు కేంద్రం అయింది. మనుమసిద్ధి రాజుల కాలంనాటి జ్ఞాపకాలు, ఆధారాలు, చరిత్ర సాక్ష్యాలను ఆధునీకరణ పేరుతో చెరిపేశారు. తిక్కన మహాభారత రచనా మందిరాన్ని భూస్థాపితం చేశారు. నూతన నిర్మాణానికి 2015లో అట్టహాసంగా శంకుస్థాపన చేసినా ఆ తర్వాత పనులు ముందుకు సాగలేదు. తిక్కన నడయాడిన నేలపై ఆ మహనీయుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో రెండేళ్ల క్రితం కాంస్య విగ్రహాన్ని తెప్పించారు. ఈ విగ్రహ తయారీకి సుప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ విశేష కృషి చేశారు. కానీ ఆ బింబం ఇప్పటికీ ప్రతిష్ఠకు నోచుకోవడం లేదు. తిక్కన విగ్రహాన్ని గానీ, ఆయన జ్ఞాపకాలను గానీ నేటి తరానికి పరిచయం చేసేందుకు పాలకులు ముందుకురాకపోవడం సాహితీవేత్తలను, చరిత్రకారులను ఆవేదనకు గురిచేస్తోంది. 



Updated Date - 2021-02-25T07:27:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising