ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముగిసిన టీచర్ల బదిలీలు

ABN, First Publish Date - 2021-01-17T04:59:38+05:30

ఉపాధ్యాయుల బదిలీలు దాదాపుగా ముగిశాయి. గ్రేడ్‌-2 హెచ్‌ఎం, ఎస్‌ఏ తెలుగు, ఎస్‌ఏ హిందీ ఉపాధ్యాయుల బదిలీల పక్రియపై కోర్టులో కేసు ఉండటంతో ఆ పక్రియ మాత్రం మళ్లీ మొదటికి వచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గ్రేడ్‌-2 హెచ్‌ఎం, ఎస్‌ఏ తెలుగు, హిందీ ఉపాధ్యాయులకు మొదటి నుంచే..

పదోన్నతి పొందిన  టీచర్లకు తాత్కాలిక పద్ధతిలో ప్లేస్‌మెంట్‌


నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట) జనవరి 16 : ఉపాధ్యాయుల బదిలీలు దాదాపుగా ముగిశాయి. గ్రేడ్‌-2 హెచ్‌ఎం, ఎస్‌ఏ తెలుగు, ఎస్‌ఏ హిందీ ఉపాధ్యాయుల బదిలీల పక్రియపై కోర్టులో కేసు ఉండటంతో ఆ పక్రియ మాత్రం మళ్లీ మొదటికి వచ్చింది. కాగా గత యేడాది అక్టోబర్‌లో పదోన్నతి పొందిన 91 మంది ఉపాధ్యాయులకు శనివారం తాత్కాలిక పద్ధతిలో  ప్లేస్‌లు కేటాయించారు. డీఈవో ఫూల్‌లో మిగిలిన 67 మంది ఉపాధ్యాయులకు  కౌన్సెలింగ్‌ నిర్వహించి  ప్రాంతాలు కేటాయించాల్సి ఉంది. వీరు కాకుండా జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 84 మంది ఉపాధ్యాయులు బదిలీలకు దరఖాస్తు చేసుకోగా వారిలో 50 మంది బదిలీ అయ్యారు. జెడ్‌పీపీ, ఎంపీపీ పాఠశాలల్లో 4387 మంది దరఖాస్తు చేసుకోగా 2196 మంది బదిలీ అయ్యారు. మొత్తం మీద రెండు యాజమాన్యాలకు సంబంధించి 4471 మంది బదిలీలకు దరఖాస్తు చేసుకోగా, 2246 మంది బదిలీ అయ్యారు. రెండు యాజమాన్యాల పాఠశాలల పరిధిలో సబ్జెక్ట్‌ల వారీగా చూస్తే స్కూల్‌ అసిస్టెంట్‌ మ్యాఽథ్స్‌లో 359 మంది దరఖాస్తు చేసుకోగా, 141 మంది బదిలీ అయ్యారు. స్కూల్‌ అసిస్టెంట్‌ పీఎస్‌లో 300 మంది దరఖాస్తు చేసుకోగా 94 మంది బదిలీ అయ్యారు. స్కూల్‌ అసిస్టెంట్‌ బీఎస్‌లో 266 మంది దరఖాస్తు చేసుకోగా 93 మంది బదిలీ అయ్యారు. స్కూల్‌ అసిస్టెంట్‌ సోషల్‌లో  249 మంది దరఖాస్తు చేసుకోగా 123 మంది బదిలీ అయ్యారు. స్కూల్‌ అసిస్టెంట్‌ పీడీలో 52 మంది దరఖాస్తు చేసుకోగా 17 మంది బదిలీ అయ్యారు. స్కూల్‌ అసిస్టెంట్‌ ఇంగ్లీషులో 281 మంది దరఖాస్తు చేసుకోగా 77 మంది బదిలీ అయ్యారు. స్కూల్‌ అసిస్టెంట్‌ ఉర్దూలో ఆరుగురు దరఖాస్తు చేసుకోగా అందరూ బదిలీ అయ్యారు. స్కూల్‌ అసిస్టెంట్‌ సంస్కృతంలో ముగ్గురు దరఖాస్తు చేసుకోగా ముగ్గురు బదిలీ అయ్యారు. పీఎస్‌హెచ్‌ఎం తెలుగులో 72 మంది దరఖాస్తు చేసుకోగా 60 మంది బదిలీ అయ్యారు. అలాగే పీఎస్‌ హెచ్‌ఎం ఉర్దూలో ఇద్దరు దరఖాస్తు చేసుకోగా ఇద్దరు బదిలీ అయ్యారు. ఇక ఎస్‌జీటీ తెలుగులో 2789 మంది దరఖాస్తు చేసుకోగా 1575 మంది బదిలీ అయ్యారు. ఎస్‌జీటీ ఉర్దూలో 92 మంది దరఖాస్తు చేసుకోగా 55 మంది బదిలీ అయ్యరు. ఇలా 4471 మంది బదిలీలకు దరఖాస్తు చేసుకోగా 2246 మంది బదిలీ అయ్యారు. 

Updated Date - 2021-01-17T04:59:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising