ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూటీఎఫ్‌ ఆధ్వర్యాన ఉపాధ్యాయుల ధర్నా

ABN, First Publish Date - 2021-04-23T04:55:09+05:30

రాష్ట్ర ప్రభుత్వం పీఆర్‌సీ కమిషన్‌ రిపోర్టును వెంటనే విడుదల చేయాలని స్థానిక మండల పరిషత్‌ కార్యాలయం వద్ద యూటీఎఫ్‌ ఆధ్వర్యాన ఉపాధ్యాయులు గురువారం ధర్నా చేశారు.

నాయుడుపేట :మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న ఉపాధ్యాయులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50



నాయుడుపేట టౌన్‌, ఏప్రిల్‌ 22 :  రాష్ట్ర ప్రభుత్వం పీఆర్‌సీ కమిషన్‌ రిపోర్టును వెంటనే విడుదల చేయాలని స్థానిక మండల పరిషత్‌ కార్యాలయం వద్ద యూటీఎఫ్‌  ఆధ్వర్యాన ఉపాధ్యాయులు గురువారం ధర్నా  చేశారు.  ఈ సందర్భంగా యూటీఎఫ్‌ జిల్లా నాయకులు చిరంజీవి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పీఆర్‌సీ కమిషన్‌ రిపోర్టును వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.  యూటీఎఫ్‌ మండల అధ్యక్షుడు సాయిమోహన్‌రెడ్డి మాట్లాడుతూ 2020 పీఆర్‌సీ కమిషన్‌ రిపోర్టు విడుదల చేసి 55 శాతం ఫిట్‌మెంట్‌తో 1-7-2018  నుంచి లబ్ధిచేకూరేలా అమలుచేయాలని కోరారు. అనంతరం మండల పరిషత్‌ కార్యాలయంలో సూపరింటెండెంట్‌ రవికుమార్‌కు వినతి త్రం అందజేశారు.  కార్యక్రమంలో యూటీఎఫ్‌ నాయకులు సుబ్బారెడ్డి, శ్రీనివాసులు, రమణ,  శివ, ప్రసాద్‌, శ్రీనివాసులు, సుబ్బారావు, రాజు పాల్గొన్నారు.

సూళ్లూరుపేట: పాదయాత్ర  సందర్భంగా తాను అధికారంలోకి వస్తే 11వ పీఆర్‌సీని అమలు చేస్తానని జగన్‌మోహన్‌రెడ్డి హామీఇచ్చి అధికారంలోకి వచ్చాక మరచారని యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు జీజే రాజశేఖర్‌ విమర్శించారు. గురువారం సూళ్లూరుపేట ఎంపీడీవో కార్యాలయం ముందు తడ,  సూళ్లూరుపేట, దొరవారిసత్రం మండలాల యూటీఎఫ్‌ ఉపాధ్యాయుల ధర్నా చేశారు. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపి 55 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీని అమలుచేయాలని డిమాండ్‌ చేశారు. పీఆర్‌సీ అమలు కోసం వచ్చేనెల 10న అమరావతిలో ఆందోళన చేపట్టనున్నట్లు తెలిపారు. అనంతరం ఎంపీడీవో నర్మదకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో యూటీఎఫ్‌ నేతలు ప్రభాకర్‌, శ్రీనివాసులు, యుగంధర్‌, రమేష్‌, రాధాకృష్ణయ్య, బాబు, సీఐటీయు నేత సుఽధాకర్‌రావు, మూడు మండలాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ నెల 16 రాత్రి ఎన్నికల విధులకు హాజరై మృతి చెందిన నూకలపాళెం ఉపాధ్యాయుడు చిందేటి రవి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని యూటీఎఫ్‌ ఉపాధ్యాయులు డిమాండ్‌ చేశారు. ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. 

Updated Date - 2021-04-23T04:55:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising