ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తలదాచుకోను తావేదీ?

ABN, First Publish Date - 2021-07-19T03:44:28+05:30

పునరావాస కేంద్రం ఏర్పాటు చేసినా, అందులో ఇళ్ల నిర్మాణా లను అఽధకారులు అడ్డుకుంటుం డడంతో కండలేరు డ్యాం నిర్వా సితుల పరిస్థితి ఆగమ్య గోచరం గా మారింది.

గుండవోలు పునరావాసకేంద్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాపూరు, జూలై 18: పునరావాస కేంద్రం ఏర్పాటు చేసినా, అందులో ఇళ్ల నిర్మాణా లను అఽధకారులు అడ్డుకుంటుం డడంతో కండలేరు డ్యాం నిర్వా సితుల పరిస్థితి ఆగమ్య గోచరం గా మారింది. కోన రహదారిలో ఎన్‌హెచ్‌ 565 సమీపంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో ప్రభుత్వం కోట్లాది రూపాయల వ్యయంతో మౌలిక వసతులు కల్పించింది. రెండేళ్ల క్రితం 888 కుటుంబాలకు ప్లాట్లు కేటా యించింది. ప్రస్తుతం వంద కుటుం బాలు అందులో నివాసం ఏర్పాటు చేసుకున్నాయి.  గతేడాది కండలేరు డ్యాంలో పూర్తి స్థా యిలో నీరు నిల్వ చేయడంతో బ్యాక్‌వాటర్‌ గ్రామాల్లోకి చేరు కున్నాయి. ఆయా ముంపు గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభం కావడం, కండలే రుకు నీరు వస్తుండడంతో నిర్వాసితుల్లో మళ్లీ ఆందోళన మొద లైంది. దీంతో వారంతా పునరావాస కేంద్రంలో ఇళ్ల నిర్మాణానికి సిద్ధమయ్యారు. అయితే, రెవెన్యూ అధికారులు, పోలీసులు చేరుకుని నిర్మాణ పనులను అడ్డుకుంటుం డ్డడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తు న్నారు. కోర్టులో వ్యాజ్యం నడు స్తోందని తమ భద్రతను పణం గా పెట్టడం ఎంతవరకు న్యాయ మని ప్రశ్నిస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే తాము ఎక్కడ తలదాచుకోవాలని అడుగుతున్నారు. 

వర్షాలొస్తే ఎలా?

గతంలో పోలీసులు నిర్మాణాలను తొలగించారు. ఇటీవల నిర్మాణాలు చేపడుతుంటే మరోసారి పోలీసులు వచ్చి అడ్డుకు న్నారని వర్షాల సీజన్‌ ప్రారంభమైతే తాము ఎలా ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాత గ్రామంలో నీళ్లు వస్తాయి కొత్త గ్రామంలో ఇళ్లనిర్మాణ పనులు చేపట్టకుంటే తాము ఎక్కడ ఉండాలంటున్నారు 

Updated Date - 2021-07-19T03:44:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising