ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వడదెబ్బ మరణాలు సంభవించకుండా చూడండి

ABN, First Publish Date - 2021-03-09T05:25:52+05:30

ఎండకాలంలో వడదెబ్బ మరణాలు సంభవించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్‌ చక్రధర్‌బాబు అఽధికారులను ఆదేశించారు.

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌చక్రధర్‌బాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అధికారుల సమీక్షలో కలెక్టర్‌ 


నెల్లూరు(హరనాథపురం), మార్చి 8 : ఎండకాలంలో వడదెబ్బ మరణాలు సంభవించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్‌ చక్రధర్‌బాబు అఽధికారులను ఆదేశించారు. వడదెబ్బ మరణాలకు సంబంధించి సోమవారం తన బంగ్లాలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ మున్సిపాలిటీలు, పంచాయతీలు, వైద్యశాలల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఓఆర్‌ఎ్‌సప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని, రైతులకు, ప్రజలకు సాగు, తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. జిల్లాలోని 16 మండలాల్లో వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ఆ మండలాలపై ప్రత్యేక దృష్టి సారించి వడగాలుల వల్ల మరణాలు సంభవించకుండా చూడాలని ఆదేశించారు. ఎండతీవ్రతకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. 


 ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో రేపు సెలవు


మున్సిపల్‌ ఎన్నికలు జరిగే వెంకటగిరి, నాయుడుపేట, సూళ్లూరుపేట, ఆత్మకూరులలో బుధవారం సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

Updated Date - 2021-03-09T05:25:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising