రాజరాజేశ్వరీ.. కుంకుమ రాగశోణి !
ABN, First Publish Date - 2021-09-04T05:07:07+05:30
నగరంలోని రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో శుక్రవారం లక్ష కుంకుమార్చన భక్తిశ్రద్ధలతో జరిగింది. అమ్మణ్ణికి ఉద యం విశేష అభిషేకాలు, పూజలు చేశారు. కొలపర్తి రమేష్ దంపతులు ఉభయకర్త లుగా గోమతి చక్రాలు, పసుపు కొమ్ములు, గవ్వలు, పసుపు, కుంకుమతో ప్రత్యేకంగా తయారు చేసిన చీరను మూలమూర్తికి అలంకరించారు.
రాజరాజేశ్వరి ఆలయంలో లక్ష కుంకుమార్చన
ముగిసిన శ్రావణ శుక్రవారం పూజలు
నెల్లూరు (సాంస్కృతికం), సెప్టెంబరు 3 : నగరంలోని రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో శుక్రవారం లక్ష కుంకుమార్చన భక్తిశ్రద్ధలతో జరిగింది. అమ్మణ్ణికి ఉద యం విశేష అభిషేకాలు, పూజలు చేశారు. కొలపర్తి రమేష్ దంపతులు ఉభయకర్త లుగా గోమతి చక్రాలు, పసుపు కొమ్ములు, గవ్వలు, పసుపు, కుంకుమతో ప్రత్యేకంగా తయారు చేసిన చీరను మూలమూర్తికి అలంకరించారు. అనివెట్టి మండపంలో ఉత్సవమూర్తిని ప్రత్యేకంగా అలంకరించి ప్రధాన అర్చకుడు తంగిరాల రాధాకృష్ణశర్మ ఆధ్వర్యంలో సామూహిక లక్ష కుంకుమార్చన నిర్వహించారు. సుందరేశ్వర స్వామికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు జరిగాయి. రాత్రి అమ్మవారికి కుంభహారతులు జరిగాయి. ఈ ఉత్సవాలను ఆలయ చైర్మన్ రత్నం జయరామ్, ఈవో సహాయ కమిషనర్ వెండిదండి శ్రీనివాస రెడ్డి, ధర్మకర్తలు శోభారాణి, శివనారాయణి, పద్మ, నరేష్, లక్ష్మీ, వెంకట రమణయ్య పర్యవేక్షించారు.
మూలస్థానేశ్వరస్వామి ఆలయంలో ఉదయం స్వామి వారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, అమ్మవారికి అభిషేకం, విశేష అలంకారం, పూజలు జరిగాయి. రాత్రి అమ్మవారికి పల్లకీ ఉత్సవం జరిగింది. ఆలయ చైర్మన్ వెంకటేశ్వరరెడ్డి, ధర్మకర్తలు, ఈవో వేణుగోపాల్ పర్యవేక్షించారు.
స్టోన్‌హౌస్‌పేటలోని వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి తమలపాకులతో అలంకారం జరిగింది. ఉదయం అభిషేకాలు, కుంకుమ పూజలు జరిగాయి. ఽఆలయంలో
నగరంలోని అన్ని అమ్మవారి ఆలయాలు, మహాలక్ష్మి ఆలయాల్లో శ్రావణ శుక్రవారం పూజలు ఘనంగా జరిగాయి. శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ వేడుకలతో శ్రావణ శుక్రవార పూజలు ముగిశాయి.
Updated Date - 2021-09-04T05:07:07+05:30 IST