ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా బాధితులకు మెరుగైన వైద్య సేవలు

ABN, First Publish Date - 2021-05-11T03:49:17+05:30

కరోనా బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జేసీ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.

సమావేశంలో మాట్లాడుతున్న జేసీ ప్రభాకర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నోడల్‌ అధికారుల సమీక్షలో జేసీ ప్రభాకర్‌రెడ్డి 

నెల్లూరు (వైద్యం) మే 10 : కరోనా బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జేసీ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.  సోమవారం స్థానికంగా నోడల్‌ అధికారులతో  నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ పల్స్‌ ఆక్సీ మీటర్లు, థర్మల్‌ గన్స్‌ సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అని ఏఎన్‌ఎంలు పరిశీలించాలనారు. అవసరమైతే వాటికి హెచ్‌డీఎస్‌ నిధుల నుంచి మరమ్మతులు చేయించాలన్నారు. పీహెచ్‌సీలలో ఐదు శాతం పల్స్‌ ఆక్సీ మీటర్లు అందుబాటులో ఉంచాలన్నారు.  హోం ఐసోలేషన్‌లో ఉన్న బాధితులను ఏఎన్‌ఎంలు పరీక్షిస్తున్నారా లేదా అధికారులు పరిశీలించాలన్నారు. ఏఎన్‌ఎంలు, ఆశాలు హోం ఐసోలేషన్‌లోని బాధితులను కలిసేందుకు సర్జికల్‌ మాస్క్‌లు, గ్లౌజ్‌లు ధరించాలన్నారు. 100 శాతం హోం ఐసోలేషన్‌ కిట్లు పంపిణీ చేయాలని సూచించారు. వారానికి ఒకసారి వైద్యులు హోం ఐసోలేషన్‌ బాధితులను పరీక్షించి వారి ఆరోగ్య స్థితిని రికార్డు చేయాలని చెప్పారు. కొవిడ్‌కు సంబంధించిన బిల్లులు జిల్లా ఆడిట్‌ అధికారి ద్వారా జేసీకి అందించాలని, మందుల బిల్లులు మాత్రం ఐసీడీఎస్‌ పీడీకి ఇవ్వాలని తెలిపారు. హోం ఐసోలేషన్‌లోని బాధితులు బయట తిరుగకుండా చర్యలు తీసుకోవాలని, కొవిడ్‌ ప్రొటోకాల్‌ పాటిస్తున్నారా లేదా పరిశీలించి సలహాలు ఇవ్వాలని తెలిపారు. సమావేశంలో ఇన్‌చార్జ్‌ డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకటప్రసాద్‌, పలువురు నోడల్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-11T03:49:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising