ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అత్యుత్తమ సేవలకు ‘జాతీయ’ గుర్తింపు

ABN, First Publish Date - 2021-07-31T04:37:44+05:30

జిల్లావ్యాప్తంగా అత్యుత్తమ వైద్యసేవలు అందించిన ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు జాతీయస్థాయి గుర్తింపు వచ్చింది.

విడవలూరు మండలంలోని రామతీర్థం ఆరోగ్య కేంద్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లావ్యాప్తంగా ఐదు ఆరోగ్య కేంద్రాల ఎంపిక

91.84 పాయింట్లతో రామతీర్థం పీహెచసీ అగ్రస్ధానం


నెల్లూరు (వైద్యం) జూలై 30 : జిల్లావ్యాప్తంగా అత్యుత్తమ వైద్యసేవలు అందించిన ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు జాతీయస్థాయి గుర్తింపు వచ్చింది. జిల్లావ్యాప్తంగా ఐదు ఆరోగ్య కేంద్రాలు జాతీయ స్థాయి నాణ్యత ప్రమాణాలు కలిగిన ఆసుపత్రులుగా గుర్తిస్తూ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా నేషనల్‌ హెల్త్‌ మిషన సహకారంతో నడుస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో అత్యుత్తమ ప్రమాణాలతో వైద్య సేవలు అందిస్తున్న ఆసుపత్రులకు ఇలాంటి గుర్తింపు వస్తుంది. 7 జిల్లాల్లో ఒక్కో పీహెచసీకి నాణ్యత ప్రమాణాల గుర్తింపు వచ్చింది. అయితే, నెల్లూరు జిల్లాలో ఐదు ఆసుపత్రులకు ఈ గుర్తింపు లభించింది. విడవలూరు మండలంలోని సముద్ర తీరప్రాంత వాసులకు అత్యుత్తమ వైద్య సేవలను అందించినందుకు 91.84 వెయిటేజీ మార్కులతో రామతీర్థం పీహెచసీ జిల్లాలోనే అగ్రస్థానంలో నిలిచింది.   ఇక 2వ స్థానంలో విడవలూరు పీహెచసీ 88.71 పాయింట్లు, ముత్తుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 80.94 పాయింట్లతో 3వస్థానం, సంగం ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రం 76.78 పాయింట్లతో 4వస్థానం, దొరవారిసత్రం ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి ఐదవస్థానం దక్కింది. ఆయా  ఆరోగ్య కేంద్రాలకు నేషనల్‌ హెల్త్‌ మిషన కింద రూ. 3 లక్షల చొప్పున నిధులను అందచేస్తుంది. మే, జూన నెలల్లో రాష్ట్ర క్వాలిటీ అస్యూరెన్స సభ్యులు పరిశీలించి, ఎంపిక చేశారు. 

Updated Date - 2021-07-31T04:37:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising