ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సేంద్రీయ ఎరువులతో పోషకాలు వృద్ధి

ABN, First Publish Date - 2021-05-06T03:36:59+05:30

: సేంద్రీయ ఎరువులతోనే భూమిలో పోషకాలు వృద్ధి చెందుతాయని మండల వ్యవసాయ అధికారి యు.గీతాకుమారి పేర్కొన్నారు. బుధవారం ఆమె మండలంలోని

వర్మికంపోస్టు యూనిట్‌ను పరిశీలిస్తున్న ఎంఏవో గీతాకుమారి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తోటపల్లిగూడూరు, మే 5 : సేంద్రీయ ఎరువులతోనే భూమిలో పోషకాలు వృద్ధి చెందుతాయని మండల వ్యవసాయ అధికారి యు.గీతాకుమారి పేర్కొన్నారు. బుధవారం ఆమె మండలంలోని ద్వారకామాయి వర్మీ కంపోస్టు యూనిట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ నెలలో పోషక విలువలు పెరిగేందుకు సేంద్రీయ ఎరువులను వినియోగించాలన్నారు. వా నసాములతో తయారయ్యే సేంద్రీయ ఎరువులో నత్రజని 500 పీపీఎం, భాస్వరం 390 పీపీఎం, పొటాషియం 460 పీపీఎం, కాల్షియం 540 పీపీఎం, మెగ్నీషియం 110, పీపీఎం, ఇనుము 273 పీపీఎం, మాన్గనీసు 180 పీపీఎం, రాగి 21 పీపీఎం ఉంటాయని ఆమె చెప్పారు. వర్మీకంపోస్టు ఎరువులో ఇవి ఉండడం వల్ల నెల ఉత్పాదకతను అనుకూలమైన లక్షణాలు పెరుగుతాయన్నారు. అలాగే వేసిన పైరుకే కాకుండా ఆ తర్వాత వేసే 2, 3 పంటలపై కూడా ప్రభావం కనిపిస్తుందని ఆమె చెప్పారు. మొక్కకు కావాల్సిన అన్ని రకాల పోషకాలు ఇందులో లభిస్తాయని తెలిపారు. మరి ముఖ్యంగా పలు రకాల ఎంజైములు, హార్మోన్లు ఆమైనో ఆమ్లాలు తయారై మొక్క చురుగ్గా పెరిగేందుకు దోహదపడుతుందన్నారు. మొక్కలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ఆమె తెలిపారు. వర్మికంపోస్టు వినియోగించడం వల్ల కూరగాయలు, పండ్లు ఇతర ఉత్పత్తుల నాణ్యత పెరగడంతో పాటు రంగు, రుచి వాసన కలిగి నిల్వ ఉండే గుణం పెరుగుతుందని  ఆమె వివరించారు.


Updated Date - 2021-05-06T03:36:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising