ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీజీ సెంటర్‌లో అంతర్జాతీయ సెమినార్‌

ABN, First Publish Date - 2021-04-17T03:54:27+05:30

పట్టణంలోని వీఎస్‌యూ పీజీ సెంటర్‌లో జెనిటిక్‌ ఇంజనీరింగ్‌ బయోటెక్నాలజీ నూతన ఆవిష్కరణలపై శుక్రవారం అంతర్జాతీయ సెమినార్‌ నిర్వహించారు.

టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న వీఎస్‌యూ వీసీ సుదర్శనరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలిటౌన్‌, ఏప్రిల్‌ 16: పట్టణంలోని వీఎస్‌యూ పీజీ సెంటర్‌లో జెనిటిక్‌ ఇంజనీరింగ్‌ బయోటెక్నాలజీ నూతన ఆవిష్కరణలపై శుక్రవారం అంతర్జాతీయ సెమినార్‌ నిర్వహించారు. జీవశాస్త్ర ప్రొఫెసర్‌ డాక్టర్‌ వేములూరి శైలజ ప్రధాన కార్యనిర్వాహకురాలిగా వ్యవహరించగా పీజీ సెంటర్‌ స్పెషల్‌ ఆఫీసర్‌ సీహెచ్‌ శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిఽఽథిగా ఉప కులపతి సుదర్శనరావు పాల్గొని జెనిటిక్‌ ఇంజనీరింగ్‌ ప్రాముఖ్యతను గురించి వివరించారు. రెక్టార్‌ ప్రొఫెసర్‌ చంద్రయ్య, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎల్వీ కృష్ణారెడ్డి సెమినార్‌లో పాల్గొన్నారు. డాక్టర్‌ కృష్ణారావు అప్పసాని కాలిఫోర్నియా, యూఎస్‌ఏలో జెనిట్‌క్‌ ఇంజనీరింగ్‌ నందు నూతన ఆవిష్కరణల గురించి వివరించారు. ఆంధ్ర యూనివర్శిటీ ప్రొఫెసర్‌ పద్దయ్య హ్యూమన్‌ జీనోమ్‌ ప్రాజెక్ట్‌ గురించి వివిరించారు. ఎస్వీ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ భాస్కర్‌రావు ఏనిమల్‌ బయోటెక్నాలజీ ఉపయోగాల గురించి వివరించారు. ప్రొఫెసర్‌ వీ శైలజ వందన సమర్పణతో సెమినార్‌ ముగిసింది. సెమినార్‌ ప్రొసీడింగ్‌ పుస్తకంగా ప్రచురిస్తామని ఆమె తెలిపారు.


Updated Date - 2021-04-17T03:54:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising