ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వక్ఫ్‌బోర్డు ఆస్తులను అప్పగించాలి

ABN, First Publish Date - 2021-07-31T05:14:05+05:30

ముస్లిం మైనారిటీ వక్ఫ్‌ బోర్డు ఆస్తులను వెంటనే అప్పగించక పోతే కార్పొరేషన్‌ కార్యాలయాన్ని ముట్టడిస్తామని వక్ఫ్‌ ఆస్తుల పరిరక్షణ కమిటీ నాయకులు హెచ్చరించారు.

ర్యాలీగా వస్తున్న ముస్లింలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లేకుంటే కార్పొరేషన్‌ కార్యాలయాన్ని ముట్టడిస్తాం

వక్ఫ్‌ ఆస్తుల పరిరక్షణ కమిటీ నేతల భారీ ర్యాలీ

నెల్లూరు ( వెంకటేశ్వరపురం) జూలై - 30 : ముస్లిం మైనారిటీ వక్ఫ్‌ బోర్డు ఆస్తులను వెంటనే అప్పగించక పోతే కార్పొరేషన్‌ కార్యాలయాన్ని ముట్టడిస్తామని వక్ఫ్‌ ఆస్తుల పరిరక్షణ కమిటీ నాయకులు హెచ్చరించారు. జేఏసీ ఆధ్వర్యంలో ముస్లింలు శుక్రవారం నగరంలోని వెంకటేశ్వరపురం పరిధిలో ఉన్న జనార్దనరెడ్డికాలనీలోని మసీదు నుంచి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మైనారిటీ నాయకులు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా దాదాపు 500 ఎకరాలు వక్ఫ్‌ బోర్డు ఆస్తులు అన్యాక్రాంతం అయ్యాయన్నారు. మాగుంట లేఅవుట్‌లోని స్థలం వక్ఫ్‌ బోర్డుకు చెందినదనీ, అన్ని  పత్రాలు ఉన్నా కొందరు నాయకులు, అధికారులు కలసి దానిని ఆక్రమించుకోవాలని చూస్తున్నా రన్నారు. ఆధారాలు చూపుతామని చెప్పి 20 రోజులు గడుస్తున్నా ఎలాంటి పత్రాలు చూపలేదన్నారు. ఆ స్థలం అన్ని కోర్టుల్లోనూ వక్ఫ్‌బోర్డుకు చెందిందనే తేలిందన్నారు. ఇప్పటికైనా వారం రోజుల్లో మాగుంటలే అవుట్‌లోని స్థలాన్ని వక్ఫ్‌బోర్డుకి అప్పగించాలని కోరారు. లేకుంటే పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్పోరేషన్‌ కార్యలయాన్ని ముట్టడిస్తామన్నారు. కార్యక్రమంలో పలు మసీదుల ఇమామ్‌లు , మౌజన్‌లు , మైనారిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2021-07-31T05:14:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising