ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎయిడెడ్‌ కళాశాలలను కాపాడుకోవాలి

ABN, First Publish Date - 2021-04-21T04:33:16+05:30

రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా ఎయిడెడ్‌ కళాశాలలను మూసివేయాలని నిర్ణయించి జీవో 52ను విడుదల చేసిందని, ఎయిడెడ్‌ కళాశాలలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం పిలుపునిచ్చారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్సీ విఠపు

నెల్లూరు(క్రైం),  ఏప్రిల్‌ 20: రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా ఎయిడెడ్‌ కళాశాలలను మూసివేయాలని నిర్ణయించి జీవో 52ను విడుదల చేసిందని,  ఎయిడెడ్‌ కళాశాలలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం పిలుపునిచ్చారు. ఎయిడెడ్‌ వ్యవస్థను రక్షించండి... ఉన్నత విద్యను కాపాడండి అనే అంశంపై మంగళవారం వీఆర్‌ కళాశాలలో సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ దాదాపు రెండు దశాబ్దాలుగా ఎయిడెడ్‌ కళాశాలల్లోని పోస్టుల భర్తీపై ప్రభుత్వాలు నిషేధం కొనసాగించి పథకం ప్రకారం వాటిని నిర్వీర్యం చేశాయన్నారు. విద్యార్థులు తగ్గారనే సాకుతో ప్రస్తుత ప్రభుత్వం ఈ కళాశాలల్లోని అధ్యాపకులు, ఉద్యోగులను ప్రభుత్వ కళాశాలలకు బదిలీ చేసి కళాశాలల్ని యాజమాన్యాలకు అప్పగించేందుకు మార్గదర్శకాలు రూపొందిస్తోందని ఆరోపించారు. అదే జరిగితే నెల్లూరులోని వీఆర్సీ, సర్వోదయ, వేణుగోపాలస్వామి కళాశాల, కావలి జవహర్‌భారతి వంటి గొప్ప విద్యాసంస్థలు అస్తిత్వం కోల్పోతాయన్నారు. ఈ కార్యక్రమంలో వీఆర్సీ ప్రిన్సిపాల్‌ వీవీ కృష్ణశర్మ, పలు కళాశాలల అధ్యాపకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-21T04:33:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising