ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నెల్లూరులో నాటు సారా

ABN, First Publish Date - 2021-06-22T04:47:45+05:30

నెల్లూరు నగరంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా నాటు సారా గుప్పుమంది. సారాతోపాటు అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వారిని సెబ్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని సరుకు స్వాధీనం చేసుకున్నారు.

నిందితుల వివరాలు తెలుపుతున్న ఇన్‌స్పెక్టర్‌ కిషోర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

30 లీటర్ల సరుకు స్వాధీనం

59 సీసాల మద్యం కూడా పట్టివేత


నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట), జూన్‌ 21: నెల్లూరు నగరంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా నాటు సారా గుప్పుమంది. సారాతోపాటు అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వారిని సెబ్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని సరుకు స్వాధీనం చేసుకున్నారు.  వివరాలను నగరంలోని సెబ్‌-1వ పోలీస్‌ స్టేషన్‌లో సోమవారం ఇన్‌స్పెక్టర్‌ కేపీ కిషోర్‌ విలేకరులకు తెలిపారు. ఇంటలిజెన్స్‌ టీమ్‌తో కలిసి నెల్లూరు-1 సెబ్‌ అధికారులు గాంఽధీగిరిజన కాలనీలో తనిఖీలు నిర్వహించగా అమాస లత వద్ద 30 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలోని వ్యక్తులకు కప్పరాళ్లతిప్పలో పరిచయాలు, బంధువులు ఉండటంతో అక్కడి నుంచి సారాయిను తీసుకువచ్చి నగరంలో అమ్ముతున్నారు. ఈ కేసులో మరో ముద్దాయి అమాస రమణయ్యను అరెస్ట్‌ చేయాల్సి ఉందని ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. అనికేపల్లి గ్రామానికి చెందిన మల్లికార్జున వద్ద 15 మద్యం సీసాలను, సుందరయ్య కాలనీకి చెందిన రాము వద్ద 13 సీసాలు, గంగల మునెమ్మ వద్ద 18 సీసాలు, బలిజపాలెం గ్రామానికి చెందిన నగరం వెంకటరమణయ్య వద్ద 13 సీసాల మద్యాన్ని స్వాధీనం చేసుకుని వారిపై కేసులు నమోదు చేశారు. నాటుసారా, మద్యం, గంజాయి, పేకాట, గుట్కా, ఇసుక అక్రమ రవాణా, ఎర్రచందనం వంటి నేరాలకు సంబందించిన సమాచారాన్ని 9440902511 నెంబరుకు ఫోన్‌ ద్వారాగానీ, వాట్సాప్‌ ద్వారా గానీ తెలియజేయాలని ప్రజలను ఇన్‌స్పెక్టర్‌ కోరారు.

Updated Date - 2021-06-22T04:47:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising