ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంగం ఆనకట్ట వారధిపై పెరుగుతున్న నీటి ప్రవాహం

ABN, First Publish Date - 2021-10-26T04:55:21+05:30

సంగం ఆనకట్ట వారధిపై నీటి ప్రవాహం తగ్గి మళ్లీ సోమవారం సాయంత్రానికి పెరుగుతోంది. రెండురోజుల కిందట వరకు సుమారు 7150 క్యూసెక్కులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగం, అక్టోబరు 25: సంగం ఆనకట్ట వారధిపై నీటి ప్రవాహం తగ్గి మళ్లీ సోమవారం సాయంత్రానికి పెరుగుతోంది. రెండురోజుల కిందట వరకు సుమారు 7150 క్యూసెక్కులు నీటి ప్రవాహం వస్తుంది. దీంతో ఆనకట్ట వద్ద నీటిమట్టం 10.3 అడు గులు ఉంది. సోమశిల జలాశయంలో విడుదల చేసే నీటిని ఒక్కరోజు 4150 క్యూసెక్కులకు తగ్గించారు. దీంతో ఆదివారం సాయంత్రానికి సంగం ఆనకట్ట వద్ద నీటి మట్టం 8.2 అడుగులకు పడిపోయింది. వారధి మీద పాచి పట్టి ఉండడంతో గేట్లు తీయలేదు. అయినా ఆనకట్ట ఉత్తర, దక్షిణ రాకపోకలు అత్యవసరమైన వారు జొన్నవాడ, అప్పారావుపాళెం వైపు తిరిగి వెళ్లలేక వారధి ఫాలింగ్‌ షెట్టర్ల వద్ద నడిచి రాకపోకలు సాగించారు. దీంతో సెక్షన్‌ అధికారులు గేటు తీసి రాకపోకలు పునరుద్ధరించాలనుకునే సమయంలో మళ్లీ ఆదివారం సాయంత్రం సోమశిల అధికారులు నీటి విడుదలను 10 వేల క్యూసెక్కులకు పెంచారు. దీంతో ఆనకట్ట వద్ద సోమవారం సాయంత్రానికి నీటిమట్టం పెరుగుతుండడంతో రాకపోకల పునరుద్ధరణను అధికారులు విరమించారు. ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు.


Updated Date - 2021-10-26T04:55:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising