ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇసుక, మట్టి అక్రమ రవాణాపై సెబ్‌ కొరడా

ABN, First Publish Date - 2021-01-24T04:44:42+05:30

నెల్లూరురూరల్‌ ప్రాంతంలోని పలు చోట్ల ఇసుక, మట్టిని అక్రమంగా తరలించడాన్ని సెబ్‌ నెల్లూరురూరల్‌ పోలీసులు శనివారం అడ్డుకున్నారు.

పట్టుబడిన వాహనాలతో సెబ్‌ రూరల్‌ పోలీసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాహనాలు సీజ్‌, డ్రైవర్ల అరెస్ట్‌ 

నెల్లూరురూరల్‌, జనవరి 23 : నెల్లూరురూరల్‌ ప్రాంతంలోని పలు చోట్ల ఇసుక, మట్టిని అక్రమంగా తరలించడాన్ని సెబ్‌ నెల్లూరురూరల్‌ పోలీసులు శనివారం  అడ్డుకున్నారు. తరలింపుదారులను అదుపులోకి తీసుకుని వాహనాలను సీజ్‌ చేశారు. స్పెషల్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ బ్యూరో నెల్లూరురూరల్‌ సీఐ సూర్యానారాయణ వివరాల మేరకు ఇరువూరు నుంచి జలదంకి మండలం అప్పారావుతోటకు 12 టన్నుల ఇసుక లోడుతో వెళ్తున్న టిప్పరును రూరల్‌ ప్రాంతంలోని కొండ్లపూడి సంఘం వద్ద   తనిఖీ చేశారు. కాలంచెల్లిన బిల్లులతో రవాణా చేస్తున్నట్లు నిర్ధారించారు. దీంతో టిప్పరును స్వాధీనం చేసుకుని డ్రైవర్‌ కుంచం శివయ్యను అదుపులోకి తీసుకున్నారు. కల్లూరిపల్లి కొత్తచెరువులో అక్రమంగా మట్టి తవ్వుతున్న సమాచారం అందడంతో ఆకస్మికంగా దాడి చేసి ఒక ఎక్స్‌కవేటర్‌తోపాటు 2 ట్రాక్టర్లను అదుపులోకి తీసుకుని వాటి డ్రైవర్లను అరెస్ట్‌ చేశారు. తదుపరి చర్యల నిమిత్తం రూరల్‌ పోలీసు స్టేషన్‌కు వాటిని అప్పగించినట్లు సీఐ తెలిపారు.

Updated Date - 2021-01-24T04:44:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising