ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమరానికి సంసిద్ధం!

ABN, First Publish Date - 2021-10-30T04:22:44+05:30

గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ప్రామాణికంగా తీసుకుంటే నెల్లూరు కార్పొరేషనలో టీడీపీకి బలమైన పట్టు ఉందనే విషయం స్పష్టమవుతుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు, బుచ్చి ఎన్నికల్లో టీడీపీ బరిలోకి..

ఇప్పటికే డివిజన్లు, వార్డులలో సమావేశాలు

నాయకుల సమన్వయంతో బరిలోకి సమర్థులు

క్లస్టర్లుగా విభజన.. సీనియర్లకు బాధ్యతలు


అధికార పార్టీ అక్రమాలకు నిరసనగా ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించిన తెలుగుదేశం పార్టీ త్వరలో జరగనున్న నెల్లూరు కార్పొరేషన, బుచ్చి రెడ్డిపాళెం నగర పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తుందా!? లేదా!? అనే సంశయాలకు తెరదించుతూ గట్టి నిర్ణయం తీసుకుంది. నెల్లూరు, బుచ్చి ఎన్నికలను ఆ పార్టీ సీరియ్‌సగా తీసుకుని బరిలో దిగేందుకు సమాయత్తం అవుతోంది. డివిజన, వార్డు స్థాయిలో నాయకులను సమన్వయ పరుచుకొని సమర్థులను బరిలోకి దించడానికి కసరత్తు మొదలు పెట్టింది. జిల్లా నాయకులతోపాటు బయటి జిల్లాలకు చెందిన ముఖ్యమైన నాయకులను మోహరిస్తోంది. 

 

నెల్లూరు, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి) : గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ప్రామాణికంగా తీసుకుంటే నెల్లూరు కార్పొరేషనలో టీడీపీకి బలమైన పట్టు ఉందనే విషయం స్పష్టమవుతుంది. నెల్లూరు నగర స్థానాన్ని రెండువేల పై చిలుకు ఓట్ల తేడాతో టీడీపీ చేజార్చుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్ల సరళిని గమనిస్తే చాలా డివిజన్లలో టీడీపీ బలంగా ఉందనే విషయం స్పష్టమైంది. దీనికి తోడు వైసీపీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తి అయిన సందర్భంగా ఆ పార్టీపై సహజ సిద్ధంగా వ్యక్తమయ్యే వ్యతిరేకత, ప్రజల్లో ఉన్న అసంతృప్తి, అధికార పార్టీ నాయకుల మధ్య ఉన్న కుమ్ములాటలు ఇవన్నీ అనుకూలాంశాలుగా టీడీపీ భావిస్తోంది. ఈ క్రమంలో కార్పొరేషన ఎన్నికల షెడ్యూల్‌ ఎప్పుడు వెలువడినా బలంగా పోటీ ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేసుకొంటోంది. ఆర్భాటాలకు దూరంగా చాపకింద నీరులా సర్వశక్తులను సమీకరించుకొంటోంది. నెల్లూరు, బుచ్చిలలో డివిజన్లు, వార్డుల వారీగా పార్టీల బలాబలాలను అంచనా వేస్తోంది. పార్టీ నెల్లూరు పార్లమెంటరీ అధ్యక్షుడు, మాజీ మేయర్‌ అజీజ్‌, సిటీ ఇనచార్జి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి డివిజన్ల నాయకులతో విడివిడిగా సమావేశం అవుతున్నారు. బుచ్చి మున్సిపాలిటీ వ్యవహారాలను మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. గత ఐదు రోజులుగా ఈ సమావేశాలు ఊపందుకున్నాయి. ప్రత్యర్థి పార్టీల బలం, టీడీపీ బలపడటానికి అనుసరించాల్సిన పద్ధతులపై డివిజన స్థాయి నాయకుల సలహాలు, సూచనలు తీసుకొంటున్నారు. అభ్యర్థుల విషయంలో డివిజన స్థాయి నాయకుల నుంచి ఏకాభిప్రాయాన్ని, సమ్మతిని కూడగట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. రూరల్‌, సిటీ, కోవూరు నియోజకవర్గ ఇనచార్జిల నేతృత్వంలో మాజీ మంత్రులు సోమిరెడ్డి, నారాయణ, జాతీయపార్టీ ప్రధాన కార్యదర్శి రవిచంద్రలకు అభ్యర్థుల ఎంపిక బాధ్యతను అధిష్ఠానం అప్పగించనుంది.  


క్లస్టర్లు, పర్యవేక్షణకు సీనియర్లు


నెల్లూరు కార్పొరేషనను 13 క్లస్టర్లుగా, బుచ్చి నగర పంచాయతీని మూడు క్లస్టర్లుగా విభజించారు. ఈ క్లస్టర్ల పర్యవేక్షణ బాధ్యతలను పార్టీ సీనియర్‌ నాయకులకు అప్పగించనున్నారు. జిల్లాతోపాటు పక్క జిల్లాలకు చెందిన సీనియర్‌ నాయకులను రంగంలోకి దించనున్నారు. వీరితో పాటు సిటీ, రూరల్‌కు చెందిన పార్టీ ముఖ్యనాయకులు టీడీపీలో కొనసాగుతున్న ఆనం కుటుంబీకులు, తాళ్లపాక అనురాధ, జెడ్‌.శివప్రసాద్‌, కొమ్మి లక్ష్మయ్యనాయుడు, కంభం విజయరామిరెడ్డి తదితరులకు ఎన్నికల పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించనున్నారు. 


వనరుల కొరత అధిగమించేలా..


ఎన్నికలంటే మాటలు కాదు.. వనరుల అవసరం ఎక్కువగానే ఉంటుందనే విషయం గత ఎన్నికలు నిరూపించాయి. అయితే నెల్లూరు కార్పొరేషన మేయర్‌ స్థానం ఎస్టీ జనరల్‌కు రిజర్వు కావడంతో ఈ ఎన్నికల్లో వనరుల అవసరం పెద్దగా ఉండకపోవచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. వనరులు సమకూర్చేవారి కొరత టీడీపీని వెంటాడుతున్నా, దానిని అధిగమించి ఎన్నికలను ఎదుర్కోవడానికి టీడీపీ పూర్తిస్థాయిలో సమాయత్తం అవుతోంది. 


Updated Date - 2021-10-30T04:22:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising