ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

23లోగా జియో ట్యాగింగ్‌ పూర్తి చేయండి

ABN, First Publish Date - 2021-05-18T03:17:57+05:30

ఈనెల 23వ తేదీలోగా జియో ట్యాగింగ్‌, ఫస్ట్‌ లెవల్‌ రిజిస్ర్టేషన్‌, మ్యాపింగ్‌ పూర్తి చేయాలని మండల ప్రత్యేక అధికారి, మెప్మా పీడీ

మాట్లాడుతున్న మండల ప్రత్యేక అధికారి రవీంద్ర
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెంకటాచలం, మే 17 : ఈనెల 23వ తేదీలోగా జియో ట్యాగింగ్‌, ఫస్ట్‌ లెవల్‌ రిజిస్ర్టేషన్‌, మ్యాపింగ్‌ పూర్తి చేయాలని మండల ప్రత్యేక అధికారి, మెప్మా పీడీ రవీంద్ర అన్నారు. వెంకటాచలంలోని ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లకు పలు విషయాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని 14 లేఆవుట్లల్లో 1230, సొంత స్థలాల్లో 1871 అన్ని కలిపి 3,101 పక్కా ఇళ్లు మంజూరయ్యాయన్నారు. వీటన్నింటిని నాణ్యత ప్రమాణాలతో నిర్మించాలన్నారు. జూన్‌ 1వ తేదీలోగా ఇళ్ల నిర్మాణ పనులను మొదలపెట్టి త్వరతగతిన పూర్తి చేయాలన్నారు. ఏమైనా సాంకేతిక సమస్యలు ఉంటే గృహనిర్మాణ శాఖ డీఈ, ఏఈల దృష్టికి తీసుకొచ్చి సమస్యను పరిష్కరించుకోవాలన్నారు.ఏఈ, వర్క్‌ఇన్‌స్పెక్టర్లు గ్రౌండింగ్‌ను త్వరితగతిన  పూర్తి చేయించాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ ఐఎస్‌ ప్రసాద్‌, గృహ నిర్మాణ శాఖ డీఈ వరప్రసాద్‌, ఏఈలు సీహెచ్‌ వెంకటేశ్వర్లు, రవి, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ఏపీఎం జ్యోతి, వర్క్‌ ఇన్‌స్పెక్ట్టర్లు, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-18T03:17:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising