ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి పూజలు

ABN, First Publish Date - 2021-07-25T02:58:50+05:30

గురుపౌర్ణమిని పురస్కరించుకుని పట్టణంలోని బాబా ఆలయాల్లో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.

కావలిటౌన్‌: ముసునూరు సాయిక్షేత్రంలో ప్రత్యేక అలంకరణ బాబా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలిటౌన్‌, జూలై 24: గురుపౌర్ణమిని పురస్కరించుకుని పట్టణంలోని బాబా ఆలయాల్లో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ముసునూరు శ్రీసాయి క్షేత్రంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు నాగేశ్వరరావు పర్యవేక్షణలో ఉదయం 6గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నిర్విఘ్నంగా పూజా కార్యక్రమాలు జరిగాయి. కాగడ హారతి ధ్వజారోహణతో ప్రారంభమైన వేడుకలు పల్లకీ సేవ, సెజ్‌హారతి, ప్రసాద వినియోగంతో పూజా కార్యక్రమాలు ముగిశాయి. మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. రామ్మూర్తిపేటలోని నందదీప్‌ సాయిసమాజ్‌ ఆలయంలో జరిగిన వేడుకల్లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని బాబాను దర్శించుకున్నారు. సంకులవారితోటలోని బాబా గుడిలో అర్చకులు శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో గురుపూర్ణిమ పూజలు నిర్వహించి భక్తులకు తీర్ధప్రసాదాలు అందించారు. 

సంగం : గురుపౌర్ణమి సందర్భంగా శనివారం సంగం సాయినగర్‌లో సాయిబాబా విగ్రహానికి పాల, పంచామృతాభిషేకాలు నిర్వహించి పూలతో అలంకరించారు. మహిళలు సాయివ్రతం పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం భక్తులకు అన్నదానం చేశారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి మొక్కులు తీర్చుకున్నారు. అదేవిధంగా వెంగారెడ్డిపాళెం, జండాదిబ్బ, దువ్వూరు, జంగాలదొరువు గ్రామాల్లో వెలసి ఉన్న సాయిబాబా ఆలయాల్లో గురుపౌర్ణమి వేడుకలు అంత్యంత వైభవంగా నిర్వహించారు.

ఉదయగిరి రూరల్‌ : స్థానిక బీసీ కాలనీలో వెలసి ఉన్న షిర్డీ సాయిబాబ ఆలయంలో గురుపౌర్ణమి సందర్భంగా శనివారం భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు స్వామివారిని పూలతో ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు, హోమాలు నిర్వహించారు. భక్తులు స్వామివారికి కాయాకర్పూరం అందజేసి మొక్కులు తీర్చుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. మాజీ ఎంపీపీ చేజర్ల సుబ్బారెడ్డి, జడ్పీటీసీ అభ్యర్థి మోడి రామాంజనేయులయాదవ్‌, మాజీ ఎంపీటీసీ ఉప్పుటూరి హరి, కంబాల నరసింహారెడ్డి, చేజర్ల సుధాకర్‌రెడ్డి, లక్కు రవీంద్రారెడ్డి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.






Updated Date - 2021-07-25T02:58:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising