అసాధారణ సాహితీవేత్త భరద్వాజ
ABN, First Publish Date - 2021-10-30T03:25:56+05:30
సాధారణ జీవితం గడిపి.. అసాధారణ రీతిలో సాహితీవేత్తగా కీర్తి గడించి.. జ్ఞానపీఠాన్ని అందుకున్న మేరు శిఖరమే రావూరి భరద్వాజ అని ప్రాచీన భాషల శాఖాధిపతి ఆచార్య శివరామకృష్ణ అన్నారు.
ప్రాచీన భాషల శాఖాధిపతి శివరామకృష్ణ
వెంకటాచలం, అక్టోబరు 29 : సాధారణ జీవితం గడిపి.. అసాధారణ రీతిలో సాహితీవేత్తగా కీర్తి గడించి.. జ్ఞానపీఠాన్ని అందుకున్న మేరు శిఖరమే రావూరి భరద్వాజ అని ప్రాచీన భాషల శాఖాధిపతి ఆచార్య శివరామకృష్ణ అన్నారు. మండలంలోని చవటపాళెం పంచాయతీ సరస్వతీనగర్ వద్ద ఉన్న ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన రావూరి భరద్వాజ సాహిత్య దర్శనం అనే అంతర్జాల సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఇప్పటి వరకు తెలుగు సాహిత్యంలో జ్ఞానపీఠాలు సాధించిన విశ్వనాథ, సినారె, భరద్వాజ సాహిత్యంపై జ్ఞానపీఠత్రయం - సాహిత్య దర్శనం అనే ప్రధాన శీర్షికతో మూడు రోజులపాటు అంతర్జాల సదస్సులు నిర్వహించామన్నారు. కార్యక్రమంలో పద్మశ్రీ డాక్టర్ కొలకలూరి ఇనాక్, అధ్యయన కేంద్రం పీడీ మునిరత్నం నాయుడు, డాక్టర్ గుమ్మా సాంబశివరావు, అరుణకుమారి, చల్లా శ్రీరామచంద్రమూర్తి, డాక్టర్ మేడిపల్లి రవికుమార్, డాక్టర్ ఎంఎం.వినోదిని, డాక్టర్ ఎస్. మమత, డాక్టర్ ఈతకోట ఈశ్వర్‌రావు, డాక్టర్ కే రమేష్, టీ సతీష్ తదితరులున్నారు.
Updated Date - 2021-10-30T03:25:56+05:30 IST