ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్టీసీ జోనల్‌ వర్క్‌షాపు పరిశీలన

ABN, First Publish Date - 2021-06-18T03:48:01+05:30

ఆరీ్టీస మేనేజింగ్‌ డైరెక్టర్‌ ద్వారకా తిరుమలరావు గురువారం పడుగుపాడులోని ఆర్టీసీ జోనల్‌ వర్క్‌షాపును పరిశీలించారు.

ఆర్టీసీ జోనల్‌ వర్క్‌ షాపు పరిశీలిస్తున్న ఎండీ ద్వారకా తిరుమల రావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోవూరు, జూన్‌ 17: ఆరీ్టీస మేనేజింగ్‌ డైరెక్టర్‌ ద్వారకా తిరుమలరావు గురువారం పడుగుపాడులోని ఆర్టీసీ జోనల్‌ వర్క్‌షాపును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జోనల్‌ వర్క్‌షాపు సిబ్బంది సమర్థవంతంగా పనిచేస్తున్నారని తెలిపారు. బస్సులు మరమ్మతులకు గురైన తర్వాత జోనల్‌ వర్క్‌షాపునకు తీసుకురాకుండా ముందుగానే అలాంటి బస్సులను గుర్తించి మరమ్మతులు చేస్తున్నారని పేర్కొన్నారు.   ఈ క్రమంలో డీజీఎం వాహనాలను రద్దు చేశామన్నారు. బస్సుల సమాచారం మొత్తం ఆయా డిపో మేనేజర్ల దృష్టిలో ఉంటుందని, దెబ్బతినే బస్సులను ముందుగానే గుర్తిస్తారని పేర్కొన్నారు. వర్క్‌షాపులోని టైర్ల రీట్రేడింగ్‌ను ఆయన పరిశీలించారు. అన్ని విభాగాలను పరిశీలించి కార్మికుల నుంచి సమాచారం రాబట్టారు. ఆయన వెంట ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.  


ఆర్టీసీ జోనల్‌ కళాశాల అభివృద్ధికి చర్యలు

వెంకటాచలం : ఆర్టీసీ జోనల్‌ కళాశాల అభివృద్ధికి అన్ని చర్యలు చేపడతామని ఆర్టీసీ ఎండీ సీహెచ్‌. ద్వారకా తిరుమలరావు తెలిపారు. వెంకటాచలం సమీపంలోని ఆర్టీసీ జోనల్‌ శిక్షణ కళాశాలను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం పలు సూచనలు, సలహాలిచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కళాశాల అభివృద్ధికి ప్రతిపాదనలు ఏమైనా ఉంటే పంపించాలని సూచించారు. ఆయన వెంట ఈడీ గోపినాథ్‌రెడ్డి, డిప్యూటీ సీటీఎం రవికాంత్‌, ఆర్‌ఎం శేషయ్య, విజిలెన్స్‌ సెక్యూరిటీ అధికారి రెహమాన్‌, జోనల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీధర్‌, సిబ్బంది కరీమున్నీసా తదితరులున్నారు.  

Updated Date - 2021-06-18T03:48:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising