ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్టీసీ బస్‌లో గంజాయి, సారా స్వాధీనం

ABN, First Publish Date - 2021-12-09T03:42:44+05:30

ఆర్టీసీ బస్‌లో అక్రమంగా తరలిస్తున్న 4 కేజీల గంజాయి, 7 లీటర్ల విప్పసారాను కావలి ఎస్‌ఈబీ పోలీసులు మంగళవారం అర్ధరాత్రి పట్టుకున్నారు.

నిందితులను అదుపులోకి తీసుకున్న ఎస్‌ఈబీ పోలీసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముగ్గురి అరెస్ట్‌

కావలి రూరల్‌, డిసెంబరు 8: ఆర్టీసీ బస్‌లో అక్రమంగా తరలిస్తున్న 4 కేజీల గంజాయి, 7 లీటర్ల విప్పసారాను కావలి ఎస్‌ఈబీ పోలీసులు మంగళవారం అర్ధరాత్రి పట్టుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వివరాల మేరకు.. ఎస్‌ఈబీ సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ముసునూరు టోల్‌ప్లాజా వద్ద జాతీయ రహదారిపై వాహనాల తనిఖీ చేపట్టారు. విజయవాడ నుంచి తిరుపతికి వెళ్తున్న ఆర్టీసీ సూపర్‌ లగ్జరీ బస్‌లో తనిఖీలు చేపట్టి తమిళనాడు రాష్ట్రం అరక్కోణంకు చెందిన రాజకుమార్‌, జీవరత్నం లగేజీలు పరిశీలించగా 4 కిలోల గంజాయి ఉండడాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అదే బస్‌లో తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం నుంచి 7 లీటర్ల విప్పసారా తెచ్చుకుంటున్న జిల్లాలోని దగదర్తి మండలం చౌటపుత్తేడుకు చెందిన కాకులోరి వీరబ్రహ్మయ్యను అదుపులోకి తీసుకుని సారా స్వాధీనం చేసుకున్నారు. వారిని అరెస్టు చేసి బుధవారం కోర్టులో హాజరుపర్చగా రిమాండ్‌కు పంపినట్లు సీఐ శ్రీనివాసరావు తెలిపారు. 


Updated Date - 2021-12-09T03:42:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising