ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్రమ రవాణాకు అడ్డాగా ఆర్టీసీ సర్వీసులు

ABN, First Publish Date - 2021-07-25T04:35:50+05:30

నిషేధిత వస్తువుల అక్రమ రవాణాకు ఆర్టీసీ బస్సులు అడ్డాగా మారాయి. గంజాయి, గుట్కా, ఇతర రాషా్ట్రల మద్యం, ఇతర నిషేధిత వస్తువులను తరలించేందుకు ఆర్టీసీ బస్సులను ఎంచుకుంటు న్నారు.

ఆర్టీసీ బస్సుల్లో తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకున్న సెబ్‌ అధికారులు(ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సెబ్‌ తనిఖీల్లో బయటపడుతున్న గంజాయి

ప్రయాణికుల ముసుగులో రవాణా

బస్టాండుల్లో తనిఖీలు లేనందువల్లే..

రైళ్లు లేకపోవడంతో బస్సుల్లో తరలింపు


నెల్లూరు(స్టోనహౌస్‌పేట), జూలై 24: నిషేధిత వస్తువుల అక్రమ రవాణాకు ఆర్టీసీ బస్సులు అడ్డాగా మారాయి. గంజాయి, గుట్కా, ఇతర రాషా్ట్రల మద్యం, ఇతర నిషేధిత వస్తువులను తరలించేందుకు ఆర్టీసీ బస్సులను ఎంచుకుంటు న్నారు. నిషేధిత వస్తువులను బ్యాగ్‌ల్లో ప్యాక్‌ చేసుకొని ప్రయా ణికుల్లా బస్సుల్లో ఎక్కి ప్రయాణిస్తున్నారు. సహజంగా గంజాయిను ఇతర రాషా్ట్రలకు రైళ్లలో తరలించేవారు. అయితే కరోనాతో రైళ్లు ఎక్కువ సంఖ్యలో లేకపోవడంతో రోడ్డు మార్గాన్ని ఎంచుకున్నారు. ఇటీవల సెబ్‌ అధికారులు ఆర్టీసీ బస్సుల్లో వరుస తనిఖీలు నిర్వహిస్తుండటంతో భారీ స్థాయిలో గంజాయి దొరుకుతున్నది. బెంగళూరు, చెన్నై ప్రాంతాలకు గంజాయిని తరలిస్తూ పలువురు నిందితులు సెబ్‌ అధికారులకు పట్టుబడుతున్నారు.


బస్టాండుల్లో కానరాని తనిఖీలు


ఆర్టీసీ బస్టాండుల్లో పోలీసుల తనిఖీలు పూర్తిగా కనిపించడం లేదు. విశాఖపట్నం నుంచి విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, ఇలా బస్సులు మారుతూ చెన్నై, బెంగళూరుకు గంజాయిను తరలిస్తున్నారు. ఆర్టీసీకి కేటాయించిన పోలీసులు లాంగ్‌రూట్‌ డ్రైవర్‌లకు మద్యం సేవించి ఉన్నారా..? అన్న టెన్ట చేసి రిజిస్టర్‌లో నమోదు చేయడం, బస్టాండు ఆవరణంలో పొగతాగేవరికి ఫైనలు వేయడం మాత్రమే చేస్తున్నారు. బస్టాండుల్లో, బస్సుల్లో అనుమానంగా ఉన్న వారిని తనిఖీలు చేస్తుంటే నిషేధిత వస్తువును తరలించడం తగ్గుతుంది. ఇక కొందరు ఆర్టీసీ సిబ్బంది అధిక సొమ్ముకు ఆశపడి నేరస్థులతో చేతులు కలిపి జాగ్రత్తగా నిషేఽధిత వస్తువులను బార్డర్‌ దాటిస్తున్నారు. ఇటీవల బెంగళూరు నుంచి నెల్లూరు వస్తున్న ఆర్టీసీ బస్సుల్లో భారీగా మద్యాన్ని సెబ్‌ అధికారులు స్వాదీనం చేసుకున్నారు. డ్రైవర్‌ సహకారంతోనే మద్యం రవాణా జరిగిందని అధికారులు తేల్చారు. 


 నిరంతరం తనిఖీలు


జిల్లా వ్యాప్తంగా సెబ్‌ ఆధ్వర్యంలో నిరంతరం వాహనాల తనిఖీలు జరుగుతున్నాయి. నిషేధిత వస్తువులను తరలిస్తే తప్పనిసరిగా అరెస్ట్‌ చేస్తాం. ఇప్పటికే పలు వాహనాల్లో తరలిస్తున్న వందల కేజీల గంజాయిని, మద్యాన్ని, గుట్కాలను స్వాదీనం చేసుకొని నిందితులను అరెస్ట్‌ చేశాం. 

- శ్రీలక్ష్మి, సెబ్‌ జేడీ

Updated Date - 2021-07-25T04:35:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising