ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇళ్ల నిర్మాణాలకు రూ.10.33 కోట్లు ఖర్చు

ABN, First Publish Date - 2021-07-31T05:35:27+05:30

పేదలందరికీ ఇళ్ల’ నిర్మాణాలకు ఇప్పటి వరకు రూ. 10.33 కోట్లు ఖర్చు చేశామని కలెక్టర్‌ చక్రధర్‌బాబు తెలిపారు.

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ చక్రధర్‌బాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

5 కరుణానిధి 30 : సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ చక్రధర్‌బాబు

అధికారుల సమీక్షలో కలెక్టర్‌

నెల్లూరు(హరనాథపురం), జూలై 30 :‘ పేదలందరికీ ఇళ్ల’ నిర్మాణాలకు ఇప్పటి వరకు రూ. 10.33 కోట్లు ఖర్చు చేశామని కలెక్టర్‌ చక్రధర్‌బాబు తెలిపారు. కలెక్టరేట్‌లోని తిక్కన భవన్‌లో శుక్రవారం పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంపై మండలాల ప్రత్యేకాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఆన్‌లైన్లో నమోదై పనులు ప్రారంభించిన 34,588 ఇళ్లకు ఈ మొత్తం ఖర్చుచేసినట్లు తెలిపారు. గృహ నిర్మాణాల ప్రగతిపై ప్రతి వారం సమీక్షిస్తున్నా పురోగతి లేకపోవటం విచారకరమన్నారు. ఇంటి నిర్మాణం పునాది నుంచి శ్లాబ్‌ స్థాయికి చేరుకోవాలన్నారు.  ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన ఇసుక పక్కదారి పట్టకుండా చూడాలన్నారు. ఓజిలి, టీపీగూడూరు, మనుబోలు, తడ, కావలి అర్బన్‌, నాయుడుపేట, సూళ్లూరుపేట  అర్బన్‌ తదితర ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం  ఆలస్యంగా సాగుతోందన్నారు. సమావేశంలో హౌసింగ్‌ పీడీ ఆదిసుబ్రహ్మణ్యం, టీజీపీ స్పెషల్‌ కలెక్టర్‌ నాగేశ్వరరావు, ఆర్డీవోలు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-31T05:35:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising