ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ. 8.94 లక్షల చోరీ

ABN, First Publish Date - 2021-05-17T04:45:36+05:30

మండలంలోని రావిపాడులో ఓ ఇంట్లో రూ. 8.94 లక్షలు చోరీకి గురైన సంఘటనను శనివారం సాయంత్రం ఆలస్యంగా గుర్తించారు. ఈ మేరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

డాగ్‌ స్క్వాడ్‌ సాయంతో పరిశీలిస్తున్న పోలీసు అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 క్లూస్‌టీమ్‌, డాగ్‌ స్క్వాడ్‌ పరిశీలన

ఓజిలి, మే 16 : మండలంలోని రావిపాడులో ఓ ఇంట్లో రూ. 8.94 లక్షలు చోరీకి గురైన సంఘటనను శనివారం సాయంత్రం ఆలస్యంగా గుర్తించారు. ఈ మేరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం మేరకు గ్రామానికి చెందిన దంపతులు కోళ్లపూడి గురవయ్య-పార్వతమ్మ తమకు గ్రామంలో రావాల్సిన బకాయి సొమ్మును 15-20 రోజులుగా పోగేసుకుని బీరువాలో దాచుకుంటూ వస్తున్నారు. దాంతోపాటు ధాన్యం విక్రయించిన సొమ్మును కూడా కలిపి  రూ. 8.94 లక్షలు ఉంచారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం ట్రాక్టర్‌ బాడుగకు డబ్బులు ఇచ్చేందుకు  పార్వతమ్మ  బీరువా తెరవగా అందులో దాచి ఉంచిన నగదు కనిపించలేదు. దాంతో ఆమె కంగారుపడి అంతా గాలించినా ఫలితం లేదు.  దాంతో సొమ్ము చోరీకి గురైనట్టు గుర్తించి ఆదివారం ఓజిలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్థానిక ఎస్‌ఐ శేఖర్‌బాబు, వాకాడు  సీఐ నరసింహరావు సంఘటనా స్థలానికి వెళ్లి క్లూస్‌టీమ్‌, డాగ్‌ స్క్వాడ్‌ సాయంతో పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శేఖర్‌బాబు తెలిపారు.

Updated Date - 2021-05-17T04:45:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising