శ్మశాన వాటిక దారి యథాతఽథంగా ఉంచాలి
ABN, First Publish Date - 2021-10-30T05:10:11+05:30
పట్టణంలోని ఫైర్ స్టేషన్ సమీపంలో పేరారెడ్డిపల్లి బీసీ కాలనీకి చెందిన వడ్డెరలు, నాయిబ్రాహ్మణులు శ్మశానికి వెళ్లే దారికి ప్రత్యామ్నయంగా కొందరు
ఆత్మకూరు, అక్టోబరు 29 : పట్టణంలోని ఫైర్ స్టేషన్ సమీపంలో పేరారెడ్డిపల్లి బీసీ కాలనీకి చెందిన వడ్డెరలు, నాయిబ్రాహ్మణులు శ్మశానికి వెళ్లే దారికి ప్రత్యామ్నయంగా కొందరు మరో వైపు దారిని ఏర్పాటు చేయడానికి జేసీబీతో కంపచెట్లు తొలంచారని కాలనీవాసులు పేర్కొన్నారు. శ్మశాన వాటికకు వెళ్లే దారిని యథాతథంగా ఉంచాలని సీపీఎం ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు. సీపీఎం నాయకులు కె.డేవిడ్‌రాజు, జి.లక్ష్మపతి, జేవీవీ నాయకలు లక్కు కృష్ణప్రసాద్, హరికిరణ్ పాల్గొన్నారు.
Updated Date - 2021-10-30T05:10:11+05:30 IST