ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేషన్‌ బియ్యం పట్టివేత

ABN, First Publish Date - 2021-03-03T02:32:00+05:30

రూ. లక్ష విలువచేసే రేషన్‌ బియ్యాన్ని సెబ్‌ అధికారులు సోమవారం అర్ధరాత్రి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ రేషన్‌ బియ్యం వి

స్వాధీనం చేసుకున్న బియ్యం, నిందితుడితో సెబ్‌ అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


 విలువ రూ.లక్ష 

 వివరాలు వెల్లడించిన సెబ్‌ సీఐ

నాయుడుపేట టౌన్‌, మార్చి 2 : రూ. లక్ష విలువచేసే రేషన్‌ బియ్యాన్ని సెబ్‌ అధికారులు సోమవారం అర్ధరాత్రి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ రేషన్‌ బియ్యం వివరాలను సెబ్‌ సీఐ అబ్దుల్‌ జలీల్‌ మంగళవారం విలేకరులకు తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో సెబ్‌ సీఐ, సిబ్బంది నాయుడుపేట పరిధిలోని జువ్వలపాళెం రోడ్డులో వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా ట్రక్‌ ఆటోలో బియ్యం బస్తాలు ఉన్నట్లు గుర్తించారు. వాటిని పరిశీలించడంతో రేషన్‌ బియ్యంగా గుర్తించి సెబ్‌ కార్యాలయానికి తరలించారు. చిత్తూరుజిల్లా శ్రీకాళహస్తి నుంచి రేషన్‌ బియ్యాన్ని నెల్లూరుకు తరలిస్తుండగా సెబ్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పట్టుబడ్డ 4 టన్నుల రేషన్‌ బియ్యం దాదాపు లక్ష రూపాయలు విలువచేస్తాయని సీఐ తెలిపారు. రేషన్‌ బియ్యంతోపాటు రవాణా చేస్తున్న ట్రక్‌ ఆటో, శ్రీకాళహస్తికి చెందిన మోహన్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. 


Updated Date - 2021-03-03T02:32:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising