ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సామూహిక హారతి, ధార్మిక కార్యక్రమాలు నిర్వహించాలి

ABN, First Publish Date - 2021-02-28T03:34:25+05:30

ఆలయాలను కేంద్రంగా చేసుకుని సామూహిక హారతి, ధార్మిక కార్యక్రమాలు నిర్వహించాలని నెల్లూరు, చిత్తూరు జిల్లాల ధర్మ ప్రచారకుడు వెంగళరెడ్డి పేర్కొన్నారు.

నర్రవాడలో ర్యాలీ చేపడుతున్న ధర్మ ప్రచారకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుత్తలూరు(ఉదయగిరి రూరల్‌), ఫిబ్రవరి 27: ఆలయాలను కేంద్రంగా చేసుకుని సామూహిక హారతి, ధార్మిక కార్యక్రమాలు నిర్వహించాలని నెల్లూరు, చిత్తూరు జిల్లాల ధర్మ ప్రచారకుడు వెంగళరెడ్డి పేర్కొన్నారు. శనివారం మండలంలోని నర్రవాడ గ్రామంలో వెంగమాంబ ఆలయ కల్యాణ మండపంలో సమరసతసేవా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో 18 మండలాల ధర్మ ప్రచారకులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ ధర్మం, సంస్కృతి విలువల గురించి ప్రచారం చేపట్టాలన్నారు. భవిష్యత్తు తరాలకు హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలంటే సమష్టిగా కృషి చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కొందరు మాయమాటలు చెప్పి హిందూ ధర్మాన్ని వదిలి మా దగ్గరికి రండి మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తామని చెప్పడం పద్ధతి కాదన్నారు. బోగోలు మండలం కోవూరుపల్లి గ్రామానికి చెందిన ఐదు ఎస్టీ కుటుంబాలు వెంగమాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మన ధర్మాన్ని స్వీకరించడం ఆనందదాయకమన్నారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమరసతసేవా ఫౌండేషన్‌ కన్వీనర్‌ కార్తీక్‌, రాష్ట్ర అంత్యోదయ మున్సిపల్‌ కో-కన్వీనర్‌ మేకపాటి మాల్యాద్రినాయుడు, మహిళా కన్వీనర్‌ రాజ్యలక్ష్మి, అంజమ్మ, డివిజన్‌ ఇన్‌చార్జి వెంకటేశ్వర్లు, ధర్మ ప్రచారకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-28T03:34:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising