ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉత్తుత్తి రోడ్డు ఉఫ్‌....!!

ABN, First Publish Date - 2021-01-25T05:29:50+05:30

ఈ నెల 11వ తేదీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి నెల్లూరుకు వచ్చారు. ఆయన రాకపోకల కోసం పలు ప్రాంతాల్లో రాత్రికి రాత్రి అధికారులు రహదారులకు మరమ్మతులు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీఎం కోసం హడావిడిగా నిర్మాణం

మూడు రోజులకే బోలెడు గుంతలు


ఈ నెల 11వ తేదీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి నెల్లూరుకు వచ్చారు. ఆయన రాకపోకల కోసం పలు ప్రాంతాల్లో రాత్రికి రాత్రి అధికారులు రహదారులకు మరమ్మతులు చేశారు. ఆ విధంగా రామలింగాపురం అండర్‌బ్రిడ్జి వద్ద కూడా రోడ్డు వేశారు. అయితే ఆ రహదారి పట్టుమని పది రోజులు కూడా నిలవలేదు. నాసిరకంగా నిర్మించడంతో మూడు రోజులకే గుంతలమయంగా మారింది. అడుగడుగునా గతుకులతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. రైల్వే మూడోలైను వంతెన కోసం రెండు నెలల క్రితం ఈ అండర్‌ బ్రిడ్జి మీదుగా రాకపోకలు నిలిపివేశారు. సుమారు నెల రోజులు వాహనాలను దారి మళ్లించారు. అప్పుడే ఈ రోడ్డును పటిష్టంగా నిర్మించి ఉంటే ఇప్పుడీ పరిస్థితి వచ్చేది  కాదని, ఉత్తుత్తి రోడ్డుతో లక్షల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేశారంటూ వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

- ఫొటో : స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌

Updated Date - 2021-01-25T05:29:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising