ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రాజెక్టులకు భూసేకరణ పూర్తి చేయాలి

ABN, First Publish Date - 2021-03-07T04:50:10+05:30

వివిధ ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ చక్రధర్‌బాబు రెవెన్యూ అధికారులను ఆదేశించారు.

సమీక్షలో మాట్లాడుతున్న కలెక్టర్‌ చక్రధర్‌బాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 అధికారుల సమీక్షలో కలెక్టర్‌ చక్రధర్‌బాబు


నెల్లూరు (హరనాథపురం), మార్చి 6 : వివిధ ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ చక్రధర్‌బాబు రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో  భూసేరణపై సమీక్షించారు. ప్రభుత్వం నిర్ధేశించిన గడువులోగా ఇరిగేషన్‌ ప్రాజెక్టులు, రేణిగుంట రోడ్డు విస్తరణ పనులకు సంబంధించి భూసేరణ పూర్తి చేయాలన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.  


గడువులోగా ‘ఉపాధి’ పనులు 

జిల్లాలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులు నిర్ధేశిత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ చక్రధర్‌బాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆ పథకం కింద చేపట్టిన పనుల పురోగతిపై కలెక్టరేట్‌లో సమీక్షించిన ఆయన జరుగుతున్న పనుల్లో నాణ్యత పాటించాలన్నారు. సోషల్‌ ఆడిట్‌ సక్రమంగా జరిగేలా చూడాలని, ఎక్కడైనా అవినీతి జరిగితే సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకోవాలన్నారు. పనుల పర్యవేక్షణలో సచివాలయాల  ఇంజనీరింగ్‌ సిబ్బందిని భాగస్వాములు చేయాలన్నారు. పనుల వివరాలు తెలిపేలా బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశాల్లో జేసీ హరేందిర ప్రసాద్‌, డ్వామా పీడీ తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.


భ్రూణ హత్యలు నివారించండి

జిల్లాలో భ్రూణ హత్యలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ చక్రధర్‌బాబు అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన డిస్ట్రిక్ట్‌ లెవల్‌ మల్టీ మెంబర్స్‌ అప్రొప్రియేట్‌ అథారిటీ సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ జాతీయ గణాంకాల కన్నా లింగ నిష్పత్తి తక్కువపై మండలాల్లో ఇప్పటి వరకు తీసకున్న చర్యల గురించి అడిగి తెలసుకున్నారు.  అలా్ట్రసౌండ్‌ స్కానింగ్‌ సెంటర్లపై నిఘా ఉంచాలని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. లింగనిష్పత్తి తక్కువగా ఉన్న మండలాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పీసీ అండ్‌ పీఎన్‌డీటీ యాక్టును ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకొనేలా చట్టంలో సవరణలు చేయాలని రాష్ట్ర కమిటీకి నివేదిక పంపాలని తీర్మానం చేశారు. ఈ సమావేశంలో ఎస్పీ భాస్కర్‌భాషణ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-07T04:50:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising