ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జ్వరమా.. అయితే రావద్దు!!

ABN, First Publish Date - 2021-04-17T04:55:31+05:30

సాధారణ జ్వరం, జలుబు, దగ్గు ఉన్నా కరోనా బూచి చూపి పేద, మధ్య తరగతి ప్రజలను ప్రైవేటు ఆసుపత్రులు దోచుకుంటున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రైవేటు ఆసుపత్రుల కాఠిన్యం

వైద్యం కావాలంటే రూ.వేలు కట్టాల్సిందే

పేషెంట్ల బలహీనతతో అడ్డగోలు దోపిడీ


నెల్లూరు (వైద్యం), ఏప్రిల్‌ 16 : 


ఇందుకూరుపేట మండలం మైపాడుకు చెందిన ఓ వ్యక్తి 102 డిగ్రీల జ్వరంతో నెల్లూరులోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి వెళ్లాడు. అయితే జ్వరం ఉన్న వాళ్లు ఆసుపత్రికి రావద్దంటూ అక్కడి సిబ్బంది తేల్చి చెప్పారు. చేసేది లేక మరో ఆసుపత్రికి వెళితే అక్కడ వైద్యం పేరుతో వేల రూపాయలు వసూలు చేశారు.


విడవలూరు మండలం పార్లపల్లికి చెందిన ఓ మహిళ జలుబు, జ్వరంతో ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి వెళ్లింది. ప్రస్తుతం కరోనా విజృంభిస్తోందంటూ ఇతరత్రా పరీక్షల పేరుతో వేలకు వేలు వసూలు చేశారు. కరోనా లేదని తెలిసినా ఆర్థిక కష్టాలు తప్పలేదు.


ఇలా ఒకటి కాదు .. రెండు కాదు... ఎన్నో కేసులు. సాధారణ జ్వరం, జలుబు, దగ్గు ఉన్నా కరోనా బూచి చూపి పేద, మధ్య తరగతి ప్రజలను ప్రైవేటు ఆసుపత్రులు దోచుకుంటున్నాయి. జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలు ఉన్నప్పటికీ వాటిలో ఆశించిన స్థాయిలో చికిత్సలు అందకపోవడంతో రోగులు ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు తీయాల్సి వస్తోంది. ఇదే అదునుగా వారు పరీక్షల పేరుతో భారీగా వసూలు చేస్తున్నారు. 


ప్రస్తుత వేసవిలో జ్వర పీడితుల సంఖ్య పెరుగుతోంది. అలాగే జలబు, దగ్గు కేసులు నమోదవుతున్నాయి. కరోనా లక్షణాల్లో ఇవి కూడా ఉండటంతో ఏది కరోనానో, ఏది సాధారణ జ్వరమో తేడా తెలియటం లేదని వైద్యులు చెబుతున్నారు. కొవిడ్‌ అనుమానం ఉంటే ప్రభుత్వ పరంగా ఉచితంగా పరీక్షలు చేస్తున్నారు. కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో రూ.500 తీసుకుని నిర్థారణ పరీక్షలు చేస్తున్నారు. అయితే కొందరు వైద్యులు మాత్రం  సిటీస్కాన్‌ కూడా చేయాలంటూ రూ.7వేలకు పైగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు న్నాయి. ఇలాంటి వాటిపై నిఘా ఉంచాల్సిన అధికారులు అటువైపు చూడక పోవటంతో జ్వరాల మాటున దోపిడీ జోరుగా సాగుతోంది.


రూ.5500 వసూలు చేశారు 

- శ్రీనివాసులు (బాధితుడు)

మా కుటుంబ సభ్యులకు 101 డిగ్రీల జ్వరం వచ్చింది. కొద్దిగా జలుబు కూడా చేసింది.  నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకువెళ్లాం. ఏవో మాత్రలు రాసిస్తారని భావించాము. చేతిలో డబ్బు కూడా రెండువేలు మాత్రమే ఉంది. అయితే రకరకాల పరీక్షల పేరుతో రూ. 5,500 వసూలు చేశారు. నా దగ్గర ఉన్నదిపోగా మిగిలిన దాని కోసం అప్పు చేయాల్సి వచ్చింది. 

Updated Date - 2021-04-17T04:55:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising