సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి
ABN, First Publish Date - 2021-10-30T03:25:51+05:30
ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్య సమగ్రశిక్ష అభియాన్ సొసైటీలో పని చేస్తున్న కాంట్రాక్ట్, అవుట్‌సోర్స్‌ంగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని ఏపీ సమగ్ర శిక్ష ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు కోరారు.
కావలి, అక్టోబరు 29: ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్య సమగ్రశిక్ష అభియాన్ సొసైటీలో పని చేస్తున్న కాంట్రాక్ట్, అవుట్‌సోర్స్‌ంగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని ఏపీ సమగ్ర శిక్ష ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు కోరారు. ఈ మేరకు వారు శుక్రవారం కావలి ఆర్డీవో శీనానాయక్‌ను కలిసి వినతిపత్రం అందచేశారు. అనంతరం జర్నలిస్ట్ క్లబ్‌లో విలేకర్లతో మాట్లాడుతూ సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని, ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం మినిమం ఆఫ్ టైం స్కేలు అమలు చేయాలని కోరారు. డీఏ చెల్లించాలని, చట్టప్రకారం రెగ్యులర్ ఉద్యోగులకు వర్తించే అన్ని సదుపాయాలు అమలు చేయాలని కోరారు. కొవిడ్‌తో మరణించిన సమగ్ర శిక్ష ఉద్యోగులకు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా ఎక్స్‌గ్రేషియే చెల్లించాలని, కుటుంబ సభ్యులలో ఒకరికి ఉద్యోగ అవకాశంు కల్పించాలని కోరారు. హెల్త్‌కార్డులు ఇవ్వాలని, పదవీ విరమణ చెందిన ఉద్యోగులకు గ్రాడ్యుటీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో జేఏసీ నాయకులు శ్యామల, జాన్, శ్రీనివాసులు, రమణయ్య, వెంకట్రావు, శ్రీలత, బుజ్జయ్య, హేమామాలిని పాల్గొన్నారు.
Updated Date - 2021-10-30T03:25:51+05:30 IST