ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను దోచుకుంటున్నాయి

ABN, First Publish Date - 2021-10-24T04:44:23+05:30

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌తో పాటు నిత్యావసరాలపై ధరలు పెంచుతూ ప్రజలను దోచుకుంటున్నాయని సీపీఎం జిల్లా కార్యదర్శులు శ్రీరాములు, మోహన్‌రావు, వెంకమరాజు అన్నారు.

జక్కా వెంకయ్య చిత్రపటానికి నివాళులర్పించి పార్టీ జెండాను ఆవిష్కరిస్తున్న సీపీఎం నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  సీపీఎం మండల మహాసభలో జిల్లా కార్యదర్శులు


బుచ్చిరెడ్డిపాళెం, అక్టోబరు 23: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌తో పాటు నిత్యావసరాలపై ధరలు పెంచుతూ ప్రజలను దోచుకుంటున్నాయని సీపీఎం జిల్లా కార్యదర్శులు శ్రీరాములు, మోహన్‌రావు, వెంకమరాజు అన్నారు. శనివారం బుచ్చిలోని సీపీఎం కార్యాలయంలో నిర్వహించిన 2వ మండల మహాసభలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు జక్కా వెంకయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ముందుగా సీనియర్‌ నాయకుడు వెంకోజి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వ్యవసాయంపై నల్లచట్టాలను తెచ్చినప్పుడు వైసీపీ, టీడీపీ, జనసేన మద్దతు పలికి బీజేపీకి కొమ్ముకాశాయని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, చట్టాలను ఆపకపోతే ప్రజల పక్షాన నిలదీస్తామని హెచ్చరించారు. అనంతరం నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ముత్యాల గుర్నాథం, గండవరపు శ్రీనివాసులు, తంబి రమణయ్య, జానీబాషా, పి. శ్రీనివాసులు, చల్లకొలుసు మల్లికార్జున, కోటయ్య, అంకయ్య, మునీర్‌అహ్మద్‌, కరీముల్లా, విష్ణు, తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2021-10-24T04:44:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising