ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాలికకు న్యాయం చేయాలి

ABN, First Publish Date - 2021-10-28T04:13:16+05:30

కొండాపురం మండలం రామానుజాపురంలో సామూహిక అత్యాచారానికి గురైన బాలికకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని న్యాయ పోరాట కమితిటీ సభ్యులు పేర్కొన్నారు.

ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న న్యాయపోరాట కమిటీ సభ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా

కావలి, అక్టోబరు 27: కొండాపురం మండలం రామానుజాపురంలో సామూహిక అత్యాచారానికి గురైన బాలికకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని న్యాయ పోరాట కమితిటీ సభ్యులు పేర్కొన్నారు. బాధిత బాలికకు న్యాయం చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ బుధవారం ఆర్డీవో కార్యాలయం ముందు బైటాయించి ధర్నా చేశారు. అనంతరం న్యాయపోరాట కమిటీ కన్వీనర్‌ పీ. అంబేద్కర్‌, కో కన్వీనర్‌లు సీ. శారద, ఎండీ అలీంలు మాట్లాడుతూ అత్యాచారం జరిగిన బాలిక నుంచి స్టేట్‌మెంట్‌ తీసుకోకుండా పోలీసులు రాసుకున్న స్టేట్‌మెంట్‌పై ఆ బాలికతో సంతకం చేయించి కేసును నీరు గార్చేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. బాధితురాలిని బెదిరించి సంఘటనను తప్పుదోవ పట్టించే విధంగా పోలీసులు వారికి అనుకూలంగా స్టేట్‌మెంట్‌ తీసుకున్నారని నలుగురు వ్యక్తులు రేప్‌ చేయగా కేవలం ఒకరినే అరెస్ట్‌ చేశారన్నారు. ఈ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్న కావలి డీఎస్పీ ప్రసాద్‌, కొండాపురం ఎస్‌ఐ మాల్యాద్రిలపై చర్యలు తీసుకుని వారిని సస్పెండ్‌ చేయాలని వారు డిమాండ్‌ చేశారు. ఆర్డీవో శీనానాయక్‌ వారి వద్దకు వచ్చి వారి సమస్యలను విని వినతి పత్రం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వామపక్షాల నాయకులు పసుపులేటి పెంచలయ్య, డేగా సత్యం, కరువది భాస్కర్‌, టీడీపీ నాయకులు కాకి ప్రసాద్‌, జ్యోతిబాబూరావు, యేగూరి చంద్రశేఖర్‌, వైసీపీ నాయకురాలు ఆసిఫాబేగం, ఎల్డర్స్‌క్లబ్‌ సభ్యురాలు పార్వతీ శంకర్‌, ఘ్రా సభ్యురాలు భారతి, గిరిజన సంఘనాయకురాలు చలంచర్ల పద్మ, ఎమ్మార్పీఎస్‌ నాయకులు గోచిపాతల వెంకటేశ్వర్లు, చేవూరు కిరణ్‌, కుమార్‌, అక్కిలిగుంట ఏసు, బీసీ భవన్‌ ద్రోణాదుల వెంకట్రావు, ముస్లీం నాయకులు హపీజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-28T04:13:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising