ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రామీణ ప్రాంతాల్లోనూ డిజిటల్‌ సేవలు

ABN, First Publish Date - 2021-03-03T04:13:55+05:30

గ్రామీణ ప్రాంత ప్రజలకు పోస్టల్‌ శాఖ ద్వారా డిజిటల్‌ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఏపీ రీజియన్‌ పోస్టుమాస్టర్‌ జనరల్‌ టీఎం శ్రీలత పేర్కొన్నారు. మంగళవారం స్థానిక తపాలా కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఆమె సిబ్బందితో సమీక్షించారు.

కార్యాలయ ఆవరణలో మొక్క నాటుతున్న పోస్టుమాస్టర్‌ జనరల్‌ శ్రీలత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తపాలా శాఖ పోస్టుమాస్టర్‌ జనరల్‌ శ్రీలత

ఉదయగిరి రూరల్‌, మార్చి 2: గ్రామీణ ప్రాంత ప్రజలకు పోస్టల్‌ శాఖ ద్వారా డిజిటల్‌ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఏపీ రీజియన్‌ పోస్టుమాస్టర్‌ జనరల్‌ టీఎం శ్రీలత పేర్కొన్నారు. మంగళవారం స్థానిక తపాలా కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఆమె సిబ్బందితో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇండియన్‌ పోస్టు పేమెంట్స్‌ బ్యాంకు ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పలు సంక్షేమ పథకాల నగదు ప్రజలకు వారి ఇళ్ల వద్దకే అందిస్తున్నట్లు తెలిపారు. పట్టణ బ్యాంకులకు వెళ్లే అవసరం లేకుండా పరిమిత నగదును వారి బ్యాంకు ఖాతాల నుంచి తమ సిబ్బంది దగ్గర ఉన్న డివైజ్‌ ద్వారా పొందవచ్చన్నారు. త్వరలో ఆధార్‌ సేవలు కొన్నింటిని డివైజ్‌ ద్వారా పల్లె ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నామన్నారు. ఈనెల 31వ తేదీలోపు ఇండియన్‌ పోస్టు పేమెంట్‌ బ్యాంకులో కరెంటు ఖాతా ప్రారంభించిన వారికి జీవితకాలం ఎలాంటి సర్వీసు చార్జీ లేకుండా ఉచిత సేవలు అందిస్తామన్నారు. అనంతరం కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పోస్టల్‌ సూపరింటెండెంట్‌ కేఎస్‌ వెంకటేశ్వరరావు, ఏఎస్పీ కేహెచ్‌కే ప్రసాద్‌, ఐపీవో సుధీర్‌బాబు, ఎస్‌పీఎం దినకర్‌కుమార్‌, రామకృష్ణారెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-03T04:13:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising